రమిత జిందాల్ ఒక భారతీయ షూటర్ క్రీడాకారిణి. ఆమె 2022 ఆసియా క్రీడలలో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టులో రజత పతకాన్ని, 10 మీటర్ల ఎయిర్ రైడిల్ లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం హన్స్రాజ్ కళాశాలలో చదువుతోంది.[2][3][4]
2024లో జరిగిన ఇండియన్ ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్‌లో ఆమె ప్రపంచ రికార్డు కంటే 0.1 ఎక్కువ 636.4 పాయింట్లు సాధించింది.[5]
2024 వేసవి ఒలింపిక్ క్రీడలలో జులై 28న నిర్వహించిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 221.7 పాయింట్లతో ఆమె కాంస్యాన్ని గెలుచుకుంది. దీంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశం పతకాల బోణీ కొట్టినట్టయింది. ఒలింపిక్స్ క్రీడ షూటింగ్‌లో మెడల్ గెలిచిన తొలి మహిళగా రమితా జిందాల్ నిలిచింది.[6]