రమేష్ బిధూరి | |||
పదవీ కాలం 2014 – 2024 | |||
ముందు | విజయ్ కుమార్ మల్హోత్రా | ||
---|---|---|---|
నియోజకవర్గం | దక్షిణ ఢిల్లీ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2003 – 2015 | |||
ముందు | సి.హెచ్. శిష్ పాల్ | ||
తరువాత | సాహి రామ్ | ||
నియోజకవర్గం | తుగ్లకాబాద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | బీజేపీ |
రమేష్ బిధూరి (జననం 18 జూలై 1961) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తుగ్లకాబాద్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా, దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. రమేష్ బిధూరి 2023లో పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ఒక మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు బీజేపీ అధిష్టానం 2024లో లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ పార్టీ టికెట్ ను నిరాకరించింది.[1][2]
రమేష్ బిధూరి 18 జూలై 1961న ఢిల్లీలో రామ్రిఖ్, చార్తో దేవి దంపతులకు జన్మించాడు. ఆయన ఢిల్లీ యూనివర్శిటీలోని షహీద్ భగత్ సింగ్ కాలేజ్ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీతో గ్రాడ్యుయేషన్, మీరట్ లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీ (ఎల్‌ఎల్‌బీ) పూర్తి చేసి ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు.
రమేష్ బిధురి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి బీజేపీలో వివిధ స్థాయిల్లో పని చేసి బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా (1997-2003), బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా (2003-2008), 2008 నుండి బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు. ఆయన 2003 నుండి 2015 వరకు తుగ్లకాబాద్ ఎమ్మెల్యేగా పని చేశాడు.
రమేష్ బిధూరి 2014 లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన 2019లో లోక్‌సభ ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా ఎన్నికై[3], పెట్రోలియం, సహజవాయువుపై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా పని చేశాడు.
రమేశ్ బిధూరి 2023 పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో సెప్టెంబర్ 21న ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పి) ఎంపీ డానిష్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసి అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు. దీనితో ఆయన తీరు పట్ల స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేయగా, సొంత పార్టీ నేతలే ఆయన వ్యాఖ్యలను ఖండించడంతో బీజేపీ హైకమాండ్ బిధూరికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రమేశ్ బిధూరి వ్యాఖ్యలకు రికార్డుల నుంచి తొలగిస్తునట్టు ప్యానెల్ స్పీకర్ ప్రకటించినప్పటికి వివాదం సద్దుమణగలేదు. దీంతో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా డానిష్ అలీకి క్షమాపణలు చెప్పాడు.[4][5][6]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)