రమేష్ బైస్ | |
---|---|
![]() 2024లో రమేష్ బైస్ | |
ఝార్ఖండ్ రాష్ట్ర 10వ గవర్నరు | |
In office 2021 జులై 14 – 2023 ఫిబ్రవరి 12 | |
ముఖ్యమంత్రి | హేమంత్ సోరెన్ |
అంతకు ముందు వారు | సీ.పీ. రాధాకృష్ణన్ |
త్రిపుర రాష్ట్ర 18వ గవర్నరు | |
In office 2019 జులై 29 – 2021 జులై 6 | |
ముఖ్యమంత్రి | విప్లవ్ కుమార్ దేవ్ |
అంతకు ముందు వారు | కెప్టెన్ సింగ్ సోలంకి |
తరువాత వారు | సత్యదేవ్ నారాయణ్ ఆర్య |
రాయ్‌పూర్ లోక్‌సభ సభ్యుడు | |
In office 1996–2019 | |
తరువాత వారు | సునీల్ కుమార్ సోని |
In office 1989–1991 | |
కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) | |
In office 2004 జనవరి 9 – 2004 మే 23 | |
ప్రధాన మంత్రి | అటల్ బిహారి వాజపేయి |
ఘనుల శాఖ కేంద్ర రాష్ట్ర మంత్రి | |
In office 2003 జనవరి 29 – 2004 జనవరి 8 | |
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి |
అంతకు ముందు వారు | ఉమా భారతి |
తరువాత వారు | మమతా బెనర్జీ |
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి | |
In office 2000–2003 | |
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి |
కేంద్ర రసాయన , ఎరువుల శాఖ మంత్రి | |
In office 1999 అక్టోబరు 13 – 2000 సెప్టెంబరు 30 | |
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి |
వ్యక్తిగత వివరాలు | |
జననం | రాయ్‌పూర్, సెంట్రల్ ప్రావిన్సులు, బెరార్, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, భారతదేశం) | 2 ఆగస్టు 1947
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | రమాబాయి |
సంతానం | 3 |
రమేష్ బైస్, (జననం 1948 ఆగస్టు 2) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. 2023 ఫిబ్రవరి 18 నుండి 2024 జూలై 30 వరకు వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసారు. అంతకు ముందు అతను జార్ఖండ్, త్రిపుర రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా పనిచేశారు.[1][2] ఇతను భారతీయ జనతా పార్టీ సభ్యుడు.1999 నుండి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) గా ఉన్నాడు. ఇతను రాయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 9 వ (1989), 11 వ (1996), 12 వ, 13 వ, 14 వ (2004), 15 ఇంకా 16 వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.
బైస్ 1948 ఆగస్టు 2 న మధ్యప్రదేశ్ రాష్ట్రం రాయ్‌పూర్ (ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో ) లో ఒక హిందూ క్షత్రియ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు ఖోమలాల్ బైస్. భోపాల్ పట్టణంలో బైస్ తన హయ్యర్ సెకండరీ విద్య BSE ను పూర్తి చేశాడు. ఇతనికి 1969 మే 23న రాంబాయి బైస్ తో వివాహమైనది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బైస్ వృత్తిరీత్యా వ్యవసాయదారుడు.[3]
1978 లో రాయ్‌పూర్ మునిసిపల్ కార్పొరేషన్‌కు బైస్ మొదటిసారి ఎన్నికయ్యాడు. మందిర్ హసోద్ నియోజకవర్గం నుండి 1980 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గెలిచాడు, ఆ తరువాత దఫా 1985 అసెంబ్లీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నాయకుడు సత్యనారాయణ శర్మ చేతిలో ఓడిపోయాడు. 1989లో రాయపూర్ నియోజకవర్గం నుండి మొట్టమొదటి సారి 11వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైన బైస్ ఆ తరువాత క్రమంగా 12,13,14,16వ లోక్‌సభ ఎన్నికలు కూడా గెలుపొందాడు.
బైస్ 2019 జూలై నుండి 2021 జూలై వరకు త్రిపుర రాష్ట్ర 18 వ గవర్నర్‌గా పనిచేశాడు[4], 2021 జూలై 14 నుండి 2023 ఫిబ్రవరి 12 వరకు జార్ఖండ్ 10 వ గవర్నర్‌గా పనిచేసాడు.[5]
{{cite news}}
: CS1 maint: others (link)