రవళి | |
---|---|
జననం | ఫిబ్రవరి 28 గుడివాడ, ఆంధ్రప్రదేశ్, ఇండియా |
ఇతర పేర్లు | రవళి రామకృష్ణ, అప్సర,శైలజ |
వృత్తి | సినిమా నటీమణి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 1994–ప్రస్తుతం వరకు |
జీవిత భాగస్వామి | నీలికృష్ణ |
రవళి (జ. ఫిబ్రవరి 28) 1990వ దశకములో ప్రసిద్ధి చెందిన తమిళ, తెలుగు సినిమా నటి వెండితెర పేరు. గుడివాడలో పుట్టిన ఈమె ప్రస్తుతం తన తల్లితండ్రులు, ధర్మారావు, విజయదుర్గలతో చెన్నైలో నివసిస్తుంది. ఈమె ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వము వహించిన ఆలీబాబా అరడజను దొంగలు సినిమాతో చిత్రరంగములో ప్రవేశించింది. పెళ్లి సందడి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నది. ఆ సినిమాలో రవళిపై చిత్రీకరించిన "మా పెరటి చెట్టుపైనున్న జాంపండు" పాట బాగా ప్రసిద్ధి చెందింది. వెండితెరకు శైలజగా పరిచయమైన రవళి, ఆ తరువాత అప్సరగానూ, ఆపై రవళిగానూ అదృష్టం కోసమై పేరు మార్చుకున్నది. ఈమె ఒరేయ్ రిక్షా, పెళ్ళి సందడి, శుభాకాంక్షలు (సినిమా), వినోదం వంటి విజయవంతమైన చిత్రాలలో నటించినా తెలుగు సినిమా రంగంలో కొంతకాలం తర్వాత ఈమెకు అవకాశాలు రాలేదు
తెలుగు సినిమాలలో అవకాశాలు రాక రవళి కన్నడ, తమిళ, హిందీ సినిమాలలో నటించింది. మిథున్ చక్రవర్తి ఈమెను మర్ద్ సినిమా ద్వారా హిందీ చిత్ర రంగానికి పరిచయం చేశాడు. కన్నడంలో శివ రాజ్‌కుమార్ సరసన గడబిడ కృష్ణలో, జగ్గేష్ సరసన వీరన్న, కుబేర సినిమాలలో, సుమన్ సరసన బిల్లా-రంగా సినిమాలో నటించింది. తమిళంలో రవళి సత్యరాజ్, అర్జున్, విజయకాంత్ లతో సినిమాలు చేసింది.[1] ఆ తరువాత కొన్నాళ్ళు టీ.వీ సీరియళ్లలో నటించింది. వీటిలో ముఖ్యమైనవి జెమినీ టివీలో ప్రసారమైన నమో వేంకటేశ ఒకటి.[2] 2007 మే 9న హైదరాబాదుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీరు, వ్యాపారి అయిన నీలకృష్ణను పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుని హైదరాబాదులో స్థిరపడింది.[3] 2008 మే 29న ఈ దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది.[4] 2009 ఎన్నికల సందర్భంగా రవళి తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది.[5][6]
రవళి 2007 మే 9న హైదరాబాదులోని శతత్ ఫంక్షన్ హాల్ లో నీలికృష్ణను వివాహం చేసుకుంది. ఆ తర్వాత తన రిటైర్మెంట్ ను ప్రకటించింది.[8] వీరికి మే 2008లో ఒక పాప జన్మించింది.[9]
సంవత్సర | సినిమా | పాత్ర | భాష | నోట్సు |
---|---|---|---|---|
1994 | ఆలీబాబా అరడజను దొంగలు | తెలుగు | ||
1995 | రియల్ హీరో | తెలుగు | ||
తిరుమూర్తి | తమిళం | |||
గాంధీ పిరంత మన్ | తమిళం | |||
1996 | వినోదం
Pellala Rajyam |
తెలుగు | ||
1996 | పెళ్ళి సందడి | తెలుగు | ||
రాముడొచ్చాడు | తెలుగు | |||
1997 | పెరియా మానుషన్ | తమిళం | ||
చిన్నబ్బాయి[10] | సత్యవతి | తెలుగు | ||
అభిమన్యు | తమిళం | |||
శుభాకాంక్షలు (సినిమా) | తెలుగు | |||
1998 | మర్డ్ | హిందీ | ||
కడిబిడి కృష్ణ | కన్నడం | |||
1999 | కుబేరా | ఐశ్వర్య | కన్నడం | |
2000 | కరిసక్కట్టు పూవె | నాగమణి | తమిళం | |
నిన్నే ప్రేమిస్తా | తెలుగు | |||
నాగలింగం | తమిళం | |||
ఉన్నై కన్ తెడుదై | తమిళం | |||
2002 | పదవి వీట్టు అమ్మన్ | తమిళం | ||
2003 | అంబు తొల్లై | Chinnathayi | తమిళం | |
2005 | వీరన్న | కన్నడం | ||
2006 | స్టాలిన్ | తెలుగు |