రవీందర్ కౌశిక్ (1952–1999) ప్రముఖ భారతీయ రహస్య ఏజెంటు. ఆయన మాజీ రా ఏజెంటు. పాకిస్థాన్ సైన్యానికి అనుకోకుండా దొరికిపోయి జైలుశిక్ష అనుభవించి జైలులో మరణించాడు[1][2][3][4].[5] ఇతనిని బ్లాక్ టైగర్ అని పిలుస్తారు.
రవీందర్ 1952 ఏప్రిల్ 11 న కర్నాల్, హర్యానాలో జన్మించారు. ఆయనకు నాటకాలలో ప్రవేశం ఉండేది. తన 23 వ ఏటనే ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ RAW లో చేరారు. ఆ రోజులలో పాకిస్తాన్కు "అండర్ కవర్"గా వెళ్ళడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో నేను వెళ్ళతాను అని ముందుకు వచ్చాడు[1].
పాకిస్థాన్ వెళ్ళడం కోసం ఉర్ధూ నేర్చుకున్నాడు, మతం మార్చుకున్నాడు, వారి మతవిద్యను కూడా నేర్చుకొని అహమ్మద్ షాకీర్ అనే పేరుతొ 1975 లో పాకిస్థాన్ వెళ్ళాడు.[6] [7] పాకిస్థాన్ కు అనుమానం రాకుండా ఉండటానికి ముందుగా కరాచి యూనివర్శిటీలో LLB పూర్తిచేసి తరువాత పెద్ద హోదాలో పాకిస్తాన్ ఆర్మీలో చేరాడు[4]. ఇస్లాం మతం తీసుకున్నాడు.[8] స్థానికంగా ఉండే అమానత్ ను వివాహమాడాడు. 1979 నుండి 1983 వ సంవత్సరం వరకు అత్యంత విలువైన సమాచారాన్ని RAW, భారతీయ సైనిక దళాలకు పంపించేవాడు[5]. పాకిస్థాన్ దొంగ దెబ్బ తీయలనుకున్న ప్రతిసారి ముందగ సమాచారం ఇచ్చి కాపాడేవాడు. కాని దురదృష్ట వశాతూ మసిహ అనే మరొక సీక్రెట్ ఏజెంట్ చేసిన తప్పు వలన రవీందర్ పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోయాడు.
అప్పటి నుండి 16 సంవత్సరాలు ఇండియా రహస్యాలు చెప్పమని తీవ్రంగా హింసించారు. అయినప్పటికీ గొప్ప దేశభక్తుడైన ఈ వీరుడు ఒక్క రహస్యం కూడా బయట పెట్టలేదట. మన భారత ప్రభుత్వం ఎప్పటికైనా కాపాడుతుందని ఎదురు చూసి చూసి చివరికి క్షయ వ్యాధి సోకి 1999 జూలై 26 న మరణించారు[3]. అతనిని జైలు వెనుక భాగంలోనే ఖననం చేసారు[1]. ఇతనికి స్వయానా ఇందిరా గాంధీనే బ్లాక్ టైగర్ అని బిరుదునిచ్చింది.
ఆయన వ్రాసిన ఉత్తరాలలో ఒకదానిలో ఈ విధంగా వ్రాసారు,
"Kya Bharat jaise bade desh ke liye kurbani dene waalon ko yahi milta hai?" (Is this the reward a person gets for sacrificing his life for a great nation like India?)[3]