Ravinder Singh | |
---|---|
![]() Ravinder Singh | |
Born | Burla, Sambalpur, Odisha, India | 4 ఫిబ్రవరి 1982
Occupation | Writer |
Nationality | Indian |
Alma mater | Indian School of Business, Hyderabad |
Genre | Fiction |
Notable works | I Too Had a Love Story[1][2] |
Spouse | Khushboo Chauhan |
రవీందర్ సింగ్ (English: Ravinder Singh) ఒక భారతీయ రచయిత. సాధారణంగా ఆంగ్లంలో రచనలు చేసే ఈ యువ రచయిత ఇప్పటికి అయిదు నవలలు రాశారు. కోల్‌కతాలో ఓ సిక్కు కుటుంబంలో జన్మించిన రవీందర్ సింగ్ తన బాల్యాన్ని సంబాల్‌పూర్‌లో గడిపారు. ఒడిశాలోని సంబాల్‌పూర్‌లో గురు నానక్ స్కూల్‌లో పదవ తరగతి పూర్తి చేసిన రవీందర్ సింగ్ కర్ణాటకలోని గురునానక్ దేవ్ ఇంజినీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్సులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తర్వాత భువనేశ్వర్‌లోని ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌లో అయిదు సంవత్సరములు పనిచేశారు.
ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబిఏ చేశారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నప్పుడే ఫుల్ టైమ్ నవలా రచయితగా మారాలని భావించారు. రవీందర్ తొలి పుస్తకం “ఐ టూ హ్యాడ్ యే లవ్ స్టోరీ”ని ఇన్ఫోసిస్ అధినేత ఎన్.ఆర్. నారాయణమూర్తి సమీక్షించడం విశేషం.
1. విషయ ప్రదాత: యూత్ డెవలపర్స్ వెబ్ సంచికలోని వ్యాసం 2.విషయ ప్రదాత: ఫోర్బ్స్ ఇండియాలోని వ్యాసం