క్రికెట్ సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఫాస్ట్ మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 183) | 1988 నవంబరు 24 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక వన్‌డే (క్యాప్ 69) | 1988 డిసెంబరు 17 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2018 ఫిబ్రవరి 1 |
రషీద్ గులాం మహ్మద్ పటేల్ (జననం 1964 జూన్ 1) భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఎడమచేతి ఫాస్ట్ బౌలర్. అతను బరోడా తరపున 1986-87, 1996-97 మధ్య దేశీయ క్రికెట్ ఆడాడు.
రషీద్ పటేల్ భారత్ తరపున పెద్దగా విజయవంతం కాలేదు. 1988-89లో న్యూజిలాండ్‌పై బాంబేలో ఆడినది అతని ఏకైక టెస్టు. ఆరంభంలో ఓపెనర్లను కొంత ఇబ్బంది పెట్టడం తప్ప, అతను ఎటువంటి ముద్ర వేయలేదు. బ్యాటింగులో రెండు సార్లు పరుగులేమీ చెయ్యకుండానే ఔటయ్యాడు. అదే జట్టుతో జరిగిన ఏకైక వన్డే మ్యాచ్‌లో అతను 10 ఓవర్లు బౌలింగ్ చేసి 58 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు.
జంషెడ్‌పూర్‌లో జరిగిన 1990–91 దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో వెస్ట్ జోన్ నార్త్‌తో ఆడినప్పుడు అతను ప్రకాశించాడు. ఇరు పక్షాల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం, స్లెడ్జింగ్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్ అది. చివరి రోజున నార్త్ జోన్ రెండో సారి బ్యాటింగ్ చేస్తుండగా, అప్పటికే గేమ్‌లో నిర్ణయాత్మక ఆధిక్యం సాధించిన నేపథ్యంలో, పటేల్ స్టంప్‌ను తీసి నార్త్ ఓపెనర్ రమణ్ లాంబాపై దాడి చేశాడు. [1] పటేల్ అంతకుముందు క్రీజుపైన పరిగెత్తడంతో, అలా చేయవద్దని లాంబా అతనిని హెచ్చరించాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం రేగింది. చివరి రోజు టీకి పదిహేను నిమిషాల ముందు ఈ వాగ్వాదం ఆగింది.[2] లాంబా బ్యాట్‌తో తన వైపు దూసుకువస్తున్నపుడు, తనను తాను రక్షించుకోవడం కోసం మాత్రమే లా చేసానని పటేల్ సమర్థించుకున్నాడు. తాను లాంబా బ్యాట్‌ను మూడుసార్లు కొట్టానని అతన్ని కొట్టలేదనీ వాదించాడు.[3] నాలుగు వారాల తర్వాత మాధవరావు సింధియా, MAK పటౌడీ, రాజ్ సింగ్ దుంగార్‌పూర్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల క్రమశిక్షణ కమిటీ, పటేల్‌పై 13 నెలలు, లాంబాపై 10 నెలలు నిషేధం విధించింది. [4] నిషేధం నుండి తిరిగి వచ్చిన తర్వాత పటేల్, కెరీర్లో మరి గుర్తింపు పొందలేదు.