రష్మి గౌతమ్ | |
---|---|
జననం | |
ఇతర పేర్లు | రష్మి |
వృత్తి | నటి, వ్యాఖ్యాత, టెలివిజన్ ప్రెసెంటర్ |
రష్మి గౌతమ్ ఒక సినీ నటి, టి. వి వ్యాఖ్యాత. ఈటివిలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ హాస్యకార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.[1]
రష్మి తల్లి ఒడిషా రాష్ట్రానికి చెందింది. తండ్రి ఉత్తర ప్రదేశ్కు చెందిన వాడు. ఆమె విశాఖపట్నంలో పుట్టి పెరిగింది.[1] చిత్ర పరిశ్రమ కోసం హైదరాబాదుకు వచ్చింది.[2]
2002లో సవ్వడి అనే సినిమాతో ఆమె సినిమా కెరీర్ ప్రారంభమైంది.[1] కానీ ఆ సినిమా విడుదల కాలేదు. తర్వాత ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా నటించిన హోలీ సినిమాలో సహాయ పాత్ర పోషించింది. తర్వాత యువ అనే సీరియల్ లో నటించింది. 2010లో తెలుగులో వచ్చిన ప్రస్థానం చిత్రంలో రష్మి సహాయనటిగా చేసింది. ఆ తరువాత ఒక రియాలిటీ డ్యాన్స్ షోలో రష్మి డ్యాన్స్ చూసిన నటి సంగీత కందెన్ సినిమాకి అవకాశం ఇప్పించింది. అలా కందెన్ చిత్రంలో నర్మద అనే ప్రధాన పాత్రను రష్మి పోషించింది. 2011లో తమిళ వచ్చిన కందెన్ అనే శృంగార చిత్రంలో నటించి, తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది[3]
సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2002 | హోలీ | షాలు | తెలుగు | |
2004 | ఆది కేరాఫ్ ఎ.బి.ఎన్. కాలేజ్ | జ్యోత్స్న | తెలుగు | |
2006 | థాంక్స్ | తేజస్విని | తెలుగు | |
2009 | కరెంట్ | గీతా | తెలుగు | |
2009 | వెల్ డన్ అబ్బా | గీతా | హందీ | |
2009 | గణేష్ | అర్చన | తెలుగు | |
2009 | బిందాస్ | గీతా | తెలుగు | |
2010 | చలాకీ | లో | తెలుగు | |
2010 | ప్రస్థానం | నదియా | తెలుగు | |
2011 | కందెన్ | నర్మద | తమిళం | |
2012 | లాగిన్ | వృతిక | హందీ | |
2012 | గురు | అంకిత | కన్నడ | ఉత్తమ మొదటి చిత్ర నటిగా సైమా అవార్డుకు నామినెట్ |
2012 | మాప్పిలై వినాయగర్ | తమిళం | ||
2013 | ప్రియముదన్ ప్రియ | తమిళం | చిత్రీకరణలో ఉంది | |
2015 | దౌలత్ | తమిళం | ||
2015 | బస్తీ | ఐటం సాంగ్ | తెలుగు | |
2015 | వ్యూహం | తెలుగు | చిత్రీకరణలో ఉంది | |
2015 | చారుశీల[4][5] | చారుశీల | తెలుగు | |
2016 | గుంటూర్ టాకీస్[6] | సువర్ణ | తెలుగు | |
2016 | రాణి గారి బంగళా[7] | తెలుగు | ||
2016 | అంతం[8] | వనిత | తెలుగు | |
2016 | తను వచ్చెనంట[9] | తెలుగు | ||
2017 | నెక్స్ట్ నువ్వే | రష్మి | ||
2018 | అంతకు మించి | మధుప్రియ | ||
2019 | శివరంజని | మధు (వల్లీ) | ||
2021 | బొమ్మ బ్లాక్‌బస్టర్ | |||
2023 | బాయ్స్ హాస్టల్ |
సంవత్సరం | ప్రొడక్షన్ | పాత్ర పేరు | ఛానల్ పేరు |
---|---|---|---|
2007 | యువ | స్వాతి | వనిత టీవీ |
2011 | ఐడియా సూపర్ | పోటీదారురాలు | ఈటీవీ |
2013 | జబర్దస్త్ కతర్నాక్ కామెడీ షో | వ్యాఖ్యాత | ఈటీవీ |
2013 | సూపర్ కుటుంబం | వ్యాఖ్యాత | జెమినీ టీవీ |
2014 | రగడ ది అల్టిమేట్ డాన్స్ షో | వ్యాఖ్యాత | టాలీవుడ్ టీవీ |
2014 | ఎక్స్ట్రా జబర్దస్త్ | వ్యాఖ్యాత | ఈటీవీ |
2016 | ఢీ జోడి | టీమ్ లీడర్ | ఈటీవీ |
2022 | శ్రీదేవి డ్రామా కంపనీ | ఇంద్రజతో సహా వ్యాఖ్యాత | ఈటీవీ |
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link)
ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రష్మి గౌతమ్ పేజీ