వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రస్సెల్ ప్రేమకుమారన్ ఆర్నాల్డ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కొలంబో, శ్రీలంక | 1973 అక్టోబరు 25||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్ మాన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 68) | 1997 ఏప్రిల్ 19 - పాకిస్తాన్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2004 జూలై 1 - ఆస్ట్రేలియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 91) | 1997 నవంబరు 6 - దక్షిణాఫ్రికా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2007 ఏప్రిల్ 28 - ఆస్ట్రేలియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక T20I (క్యాప్ 1) | 2006 జూన్ 15 - ఇంగ్లాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2016 మే 2 |
రస్సెల్ ప్రేమకుమారన్ ఆర్నాల్డ్ (జననం 1973, అక్టోబరు 25), తమిళ సంతతికి చెందిన శ్రీలంక మాజీ క్రికెటర్. ఇతను క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లలో ఆడాడు.[1][2] అంతర్జాతీయ స్థాయిలో శ్రీలంక జట్టు బ్యాటింగ్ చేయడంలో ఫినిషర్ పాత్ర పోషించాడు.[3] ప్రస్తుతం అంతర్జాతీయ వ్యాఖ్యాతగా పనిచేస్తున్నాడు. శ్రీలంక మొట్టమొదటి టీ20 జట్టులో భాగంగా ఉన్న ఇతను శ్రీలంకకు మొదటి ట్వంటీ 20 అంతర్జాతీయ క్యాప్ అందుకున్నాడు. 2007 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్‌లో ఫైనల్ ఆడిన తర్వాత 2007లో క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.[4][5]
తన తాత ప్రోత్సాహంతో క్రికెట్ లోకి వచ్చిన ఆర్నాల్డ్, కొలంబోలోని సెయింట్ పీటర్స్ కళాశాలలో పాఠశాల క్రికెట్ ఆడాడు. అక్కడ ప్రాథమిక, మాధ్యమిక విద్యను అభ్యసించాడు. శ్రీలంక అండర్ 19 క్రికెట్ జట్టుకు ఆడాడు. 1992లో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ పర్యటనలో ఆకట్టుకున్నాడు. 48.40 సగటుతో 242 పరుగులు చేశాడు. 20 సంవత్సరాల వయస్సులో 1993లో తొలిసారిగా దేశవాళీ క్రికెట్‌కు వచ్చాడు.[6]
1997 ఏప్రిల్‌లో పాకిస్తాన్‌పై తన తొలి టెస్టును, ఆ తర్వాత నవంబరు 6న దక్షిణాఫ్రికాపై వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.[7][8][9]
2007 ఏప్రిల్ లో 2007 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతానని టీమ్ మేనేజర్ మైఖేల్ టిస్సెరా ద్వారా ప్రకటించాడు.[10][11]
పదవీ విరమణ తర్వాత హార్న్స్బై డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్ కోసం సిడ్నీలో ఎ-గ్రేడ్ క్రికెట్ ఆడాడు. మెల్బోర్న్లోని మెల్బోర్న్ సూపర్ కింగ్స్ తరపున కూడా ఆడాడు. ఇండియన్ క్రికెట్ లీగ్‌లో చెన్నై సూపర్ స్టార్స్ తరపున కూడా ఆడాడు.[12] సిడ్నీ ఉత్తరాన ఉన్న ఒక ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ పాఠశాల అయిన బార్కర్ కాలేజీలో శిక్షణ పొందాడు. ఐపిఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా కూడా ఉన్నాడు.