రాంకాల సరస్సు | |
---|---|
ప్రదేశం | కొల్హాపూర్, మహారాష్ట్ర |
అక్షాంశ,రేఖాంశాలు | 16°41′19″N 74°12′40″E / 16.688585°N 74.211016°E |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
రాంకాల సరస్సు మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న ఒక మంచినీటి సరస్సు.
ఎనిమిదవ శతాబ్దానికి ముందు భూకంపం ద్వారా రాంకాలా సరస్సు ఏర్పడింది. ఈ చారిత్రాత్మక సరస్సు దగ్గర నంది వాహనం గల శివుడి దేవాలయం ఉంది.శివుడు రాంకాలకు చేరుకున్నట్లయితే, ప్రళయం ప్రారంభమవుతుందని హిందూ విశ్వాసాలు తెలుపుతున్నాయి.
ఈ చారిత్రక సరస్సు చాలా మంది హిందూ ఆరాధకులకు నిధి వంటిది. రాంకాలాలో ఉత్తరాన "షాలిని ప్యాలెస్", ఈశాన్యంలో "పద్మరాజే గార్డెన్", ఆగ్నేయ ఒడ్డు వైపు ఇటీవల అభివృద్ధి చేసిన పార్క్ ఉన్నాయి. రాంకాల ఆగ్నేయ పార్కులో తాజా ఆహార మార్కెట్ ఉంది. గుర్రపు స్వారీ, బోటింగ్ వంటి కార్యకలాపాలు కూడా ఉన్నాయి. శాలిని ప్యాలెస్, నల్ల రాయి, ఇటాలియన్ పాలరాయిలతో తయారు చేయబడింది. ఇప్పుడు ఇది హోటల్‌గా మార్చబడింది. [1]