రకం | ప్రజా | ||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
స్థాపితం | 1960 | ||||||||
ఛాన్సలర్ | జార్ఖండ్ గవర్నర్ | ||||||||
వైస్ ఛాన్సలర్ | రమేష్ కుమార్ పాండే | ||||||||
స్థానం | రాంచీ, జార్ఖండ్, భారతదేశం 23°22′18″N 85°19′27″E / 23.37167°N 85.32417°E | ||||||||
కాంపస్ | పట్టణం | ||||||||
రంగులు | |||||||||
అనుబంధాలు | యూజీసీ, ఏఐయూ, నాక్[1] |
రాంచీ విశ్వవిద్యాలయం జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో ఉన్న విశ్వవిద్యాలయం. 1960లో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం జార్ఖండ్ లోని రాంచీ, గుమ్లా, ఖుంతి, సిమ్డెగా, లోహార్దగా వంటి ఐదు జిల్లాలకు వర్తిస్తుంది. ప్రస్తుతం రమేష్ కుమార్ పాండే విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఉన్నారు.[2]
విష్ణుదేవ్ నారాయణ్ సింగ్ మొదటి ఉపకులపతిగా 1960, జూలై 12న ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది.[3] పరిపాలన సౌలభ్యం కోసం 1992లో దీనిని దాదాపు సగం విభజించి వినోబాభావే విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయబడింది. మళ్ళీ 2009 జనవరిలో నిలంబెర్ పిటమ్బెర్ విశ్వవిద్యాలయం (మెదినీనగర్), ఆగష్టులో కోల్హాన్ విశ్వవిద్యాలయంగా విభజించబడింది.[4][5]
ఈ విశ్వవిద్యాలయంలోని గ్రంధాలయంలో సుమారు 1,50,000 పుస్తకాలు ఉన్నాయి. రాంచీలోని కుచ్చేరి రోడ్డులో ఉన్న విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మొత్తం రెండు విద్యార్థి హాస్టళ్లు, నాలుగు విద్యార్ధినిల వసతి గృహాలు ఉన్నాయి.
భారతదేశంలోని అనేక రాష్ట్ర విశ్వవిద్యాలయాల మాదిరిగానే, ఈ విశ్వవిద్యాలయ కులపతిగా రాష్ట్ర గవర్నరే ఉంటారు. 2002, నవంబర్ 15వరకు ఉపకులపతిగా బీహార్ గవర్నర్ ఉండగా, రాష్ట్ర విభజన జరిగి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తరువాతనుండి జార్ఖండ్ గవర్నరే విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఉంటున్నారు.
క్రమసంఖ్య | పేరు | పదావధి | పదవీకాలం |
---|---|---|---|
1 | విష్ణుదేవ్ నారాయణ్ సింగ్ | శాశ్వతము | 12 జూలై 1960 - 15 ఆగష్టు 1962 |
2 | షారాం ధర్ సింగ్ | శాశ్వత | 16 ఆగష్టు 1962 - 15 అక్టోబర్ 1965 |
3 | హరే కృష్ణ లాల్ | తాత్కాలిక | 16 అక్టోబర్ 1965 - 16 నవంబర్ 1965 |
4 | ఎ.ఎఫ్. మార్ఖం | శాశ్వత | 17 నవంబర్ 1965 - 26 సెప్టెంబరు 1969 |
5 | జార్జ్ జాకబ్ | శాశ్వత | 26 సెప్టెంబరు 1969 - 21 అక్టోబరు 1970 |
6 | గోవింద్ మిన్జ్ | తాత్కాలిక | 22 అక్టోబరు 1970 - 24 డిసెంబరు 1970 |
7 | బి.ఎన్. రోహ్తగి | శాశ్వత | 24 డిసెంబర్ 1970 - 24 ఏప్రిల్ 1972 |
8 | నందేస్వర్ ప్రసాద్ | తాత్కాలిక | 1 మే 1972 - 14 మే 1972 |
9 | కె. అబ్రహం | తాత్కాలిక | 15 మే 1972 - 2 సెప్టెంబరు 1972 |
10 | ఆర్.ఎస్. మండల్ | శాశ్వత | 3 సెప్టెంబరు 1972 - 6 నవంబర్ 1975 |
11 | ఎ.కె. ధన్ | శాశ్వత | 7 నవంబర్ 1975 - 10 జనవరి 1977 |
12 | శాలిగ్రం సింగ్ | శాశ్వత | 11 జనవరి 1977 - 28 ఆగష్టు 1978 |
13 | ఎన్.ఎల్. నాదా | శాశ్వత | 31 ఆగష్టు 1978 - 21 ఏప్రిల్ 1980 |
14 | కుమార్ సురేష్ సింగ్ | తాత్కాలిక | 22 ఏప్రిల్ 1980 - 9 జూలై 1980 |
15 | కె.సి. బోస్ | తాత్కాలిక | 10 జూలై 1980 - 16 నవంబర్ 1980 |
16 | ఎ.కె. ధన్ | శాశ్వత | 17 నవంబర్ 1980 - 14 ఫిబ్రవరి 1984 |
17 | బిశ్వనాథ్ సింగ్ | శాశ్వత | 15 ఫిబ్రవరి 1984 - 6 నవంబర్ 1985 |
18 | సచ్చిదానంద్ | శాశ్వత | 6 నవంబర్ 1985 - 2 జూలై 1986 |
19 | ఆర్.డి. ముండా | తాత్కాలిక | 2 జూలై 1986 - 26 జనవరి 1987 |
20 | ఆర్.డి. ముండా | శాశ్వత | 27 జనవరి 1987 - 10 ఆగష్టు 1988 |
21 | ఎస్. పాతాంకర్ | తాత్కాలిక | 11 ఆగష్టు 1988 - 16 డిసెంబర్ 1988 |
22 | లాల్ సాహెబ్ సింగ్ | శాశ్వత | 17 డిసెంబర్ 1988 - 24 జూన్ 1990 |
23 | ఎ.కె. సింగ్ | శాశ్వత | 25 జూన్ 1990 - 26 ఆగస్టు 1992 |
24 | కె.కె. నాగ్ | శాశ్వత | 26 ఆగస్టు 1992 - 31 జనవరి 1996 |
25 | డి.పి. గుప్తా | శాశ్వత | 1 ఫిబ్రవరి 1996 - 28 నవంబర్ 1997 |
26 | సి.ఆర్. లాహా | తాత్కాలిక | 29 నవంబర్ 1997 - 2 ఏప్రిల్ 1998 |
27 | ఎస్.ఎస్. హుస్సేన్ | తాత్కాలిక | 3 ఏప్రిల్ 1998 - 3 మార్చి 1999 |
28 | ఎల్.సి.సి.ఎన్. షహెడో | శాశ్వత | 4 మార్చి 1999 - 4 జూన్ 2000 |
29 | ఫూల్ సింగ్ | తాత్కాలిక | 13 జూన్ 2000 29 - నవంబరు 2000 |
30 | ఎస్.ఎస్. హుస్సేన్ | తాత్కాలిక | 26 డిసెంబర్ 2000 - 8 ఏప్రిల్ 2001 |
31 | అమిత్ ఖారే | తాత్కాలిక | 9 ఏప్రిల్ 2001 - 10 జూన్ 2001 |
32 | అమిత్ ఖేర్ | తాత్కాలిక | 1 జూలై 2001 - 10 జూలై 2001 |
33 | ఎల్.సి.సి.ఎన్. షహెడో | శాశ్వత | 11 జూలై 2001 - 3 మార్చి 2002 |
34 | ఆనంద్ భూషణ్ | తాత్కాలిక | 4 మార్చి 2002 - 31 డిసెంబర్ 2002 |
35 | ఎస్.ఎస్. కుష్వాహ | శాశ్వత | 1 జనవరి 2003 - 31 డిసెంబరు 2005 |
36 | ఎ.ఎ. ఖాన్ | శాశ్వత | 1 జనవరి 2006 - 31 డిసెంబర్ 2011 |
37 | వి.పి. షారన్ | తాత్కాలిక | 1 జనవరి 2012 - 31 జనవరి 2012 |
38 | ఎల్.ఎన్. భగత్ | శాశ్వత | 1 ఫిబ్రవరి 2012 - 31 జనవరి 2015 |
39 | ఎం. రజియుద్దీన్ | తాత్కాలిక | 1 ఫిబ్రవరి 2015 - 2 మార్చి 2015 |
40 | రమేష్ కుమార్ పాండే | శాశ్వత | 3 మార్చి 2015 - ప్రస్తుతం |
రాంచి విశ్వవిద్యాలయంలో ఆంథ్రోపాలజీ విభాగం మ్యూజియంను ఏర్పాటుచేసింది. కేంద్ర భారతీయ రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులలోని వివిధ జాతలకు సంబంధించిన వివిధ రకాల ప్రదర్శనలు ఇక్కడ ప్రదర్శించబడుతాయి.