ఈ పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
రాంచౌరా మందిర్ | |
---|---|
రామాలయం | |
![]() | |
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 25°40′N 85°13′E / 25.667°N 85.217°E |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
జిల్లా | వైశాలి జిల్లా |
ప్రదేశం | రాంభద్ర, హాజీపూర్ |
సంస్కృతి | |
దైవం | శ్రీరాముడు |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | భారతదేశం |
చరిత్ర, నిర్వహణ | |
నిర్మించిన తేదీ | రామాయణ కాలంలో |
రామ్‌చౌరా మందిర్ భారతదేశంలోని బీహార్‌లోని హాజీపూర్ నగరంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. శ్రీ రాముడికి అంకితం చేయబడిన ఈ దేవాలయం హాజీపూర్, హెలబజార్ సమీపంలోని రామభద్రలో ఉంది. స్థానిక జానపద కథల ప్రకారం, ఇది రామాయణ కాలం నుండి ఉనికిలో ఉందని చెబుతారు, శ్రీరాముడు జనక్‌పూర్‌కు వెళ్లే మార్గంలో ఈ ప్రదేశాన్ని సందర్శించాడని నమ్ముతారు. రామచౌరా మందిర్‌లో ప్రతి సంవత్సరం శ్రీరామ నవమిని, రాముని జన్మదినోత్సవాన్ని జరుపుకునే సంప్రదాయం ఉంది. రామ నవమి సందర్భంగా చిన్న జాతర కూడా ఇక్కడ నిర్వహిస్తారు.[1]
రాంచౌరాలో త్రవ్విన పురావస్తు వస్తువులు పాట్నా మ్యూజియంలో ఉంచబడ్డాయి
విష్ణువు ఏడవ అవతారమైన శ్రీరాముడు ఇక్కడి ప్రధాన దైవం. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.
శ్రీ రాముడు, విద్యను అభ్యసించే కాలంలో ఇక్కడకు వచ్చాడని, అతని మొదటి క్షౌర వేడుక ఇక్కడే చేశారని, ఈ ఆలయం అతని పాదముద్రల మీద నిర్మించబడిందని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. ఈ పాదముద్ర భూమి నుండి 45 మీ ఎత్తులో ఉంది. రామ నవమి సందర్భంగా బేల్ (ఏగల్ మార్మెలోస్)ను ప్రసాదంగా తీసుకుంటారు. "బారి సంగత్", "ఛోటీ సంగత్" కూడా ఈ పవిత్ర స్థలానికి సమీపంలో ఉన్నాయి. పురాతన కాలంలో అనేక మంది సాధువులు, మహాత్ములు, యోగులు ఈ "సంగత్"లను సందర్శించి ప్రార్థనలు చేసేవారు. ప్రతి సంవత్సరం రామ నవమి సందర్భంగా ఇక్కడ ఒక ప్రముఖ జాతర నిర్వహిస్తారు.
ఇదే రోజన అయోధ్య (ఉత్తరప్రదేశ్), భద్రాచలం (తెలంగాణ), వాయూర్, రామపాద దేవాలయం, రామేశ్వరం (తమిళనాడు)లలో కూడా శ్రీరామనవమి ఉత్సవాన్ని జరుపుతారు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుని శోభా యాత్రలు, రథయాత్రలు అనేక ప్రదేశాలలో జరుగుతాయి.[2]
ఆలయానికి చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి, చాలా మంది సందర్శకులు మహాబీర్ చౌక్‌కు చేరుకునే దారిలో ఆలయాన్ని దర్శిస్తారు. హేబజార్ సమీపంలోని రామభద్ర, హాజీపూర్ ఆలయానికి సమీపంలో ఉన్నాయి.