రాగవర్థిని భారతీయ సాంప్రదాయ సంగీతంలో రెండు అర్థాలను కలిగి ఉంది.
రాగాన్ని ఆలాపించడంలో ప్రధాన భాగం. గాయకుడు రాగాన్ని దశల వారీగా విస్తరణ చేస్తాడు. ప్రతి ప్రధాన నోట్ లేదా స్వరం వద్ద విరామం ఇస్తాడు.
రాగవర్ధని రాగముకర్ణాటక సంగీతం లోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 32 వ మేళకర్త రాగము.[1] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని రాగచూడామణి అని అంటాడు. [2][3][4]
ఈ రాగంలోని స్వరాలు : షట్‍శ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, "కైశికి నిషాదం". ఈ సంపూర్ణ రాగంలో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 68 వ మేళకర్త రాగమైన జ్యోతిస్వరూపిణి రాగము నకు శుద్ధ మధ్యమ సమానం.