రాగా, భారత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లోని ఒక పట్టణం.[1] ఇది కమ్లే జిల్లా ప్రధాన పరిపాలనా కేంద్రస్థానం.రాగా జిల్లా ప్రధానకార్యాలయం జిరో నుండి ఉత్తరం వైపు 44 కి.మీ.దూరంలో ఉంది. ఇది రాష్ట్ర రాజధాని ఇటానగర్ నుండి దక్షిణం వైపు 100 కి.మీ.దూరంలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ 60 నియోజకవర్గాలలో ఇది ఒకటి. రాగలో ప్రధాన కార్యాలయం ఉండే కమ్లే జిల్లా ఏర్పాటుకు 2017 అక్టోబరులో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. [2]
2011 జనాభా లెక్కల ప్రకారం రాగా జనాభా 1,281, పరిపాలనా కేంద్రం "రాగ " 5,000 జనాభాను కలిగిఉంది. [3]