రాచకొండ పోలీస్ కమీషనరేట్ | |
---|---|
![]() | |
నినాదం | మీతో - మీకోసం |
ఏజెన్సీ అవలోకనం | |
ఏర్పాటు | 2016 |
ఉద్యోగులు | కమీషనర్ ఆఫ్ పోలీస్ డిప్యూటి కమీషనర్ అడిషనల్ డిప్యూటి కమీషనర్ పోలీస్ ఇన్స్పెక్టర్స్ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్స్ సబ్ పోలీస్ ఇన్స్పెక్టర్స్ |
అధికార పరిధి నిర్మాణం | |
కార్యకలాపాల అధికార పరిధి | మల్కాజిగిరి జోన్, ఎల్.బి. నగర్ జోన్, భువనగిరి జోన్, తెలంగాణ, భారతదేశం |
చట్టపరమైన అధికార పరిధి | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, రంగారెడ్డి జిల్లా |
ప్రధాన కార్యాలయం | నేరెడ్‌మెట్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, తెలంగాణ[1] |
ఏజెన్సీ అధికారులు |
|
మాతృ ఏజెన్సీ | తెలంగాణ రాష్ట్ర పోలీస్ |
వెబ్‌సైట్ | |
http://rachakondapolice.telangana.gov.in/ |
రాచకొండ పోలీస్ కమీషనరేట్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పోలీసు కమిషనరేట్.[2] హైదరాబాదులోని మూడు పోలీసు కమిషనరేట్లలో ఇదీ ఒకటి.[3] ఈ కమిషనరేట్ కు ప్రస్తుతం జి. సుధీర్ బాబు కమిషనర్‌గా ఉన్నాడు.[4]
2016 జూన్ నెలలో సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీసు నుండి విడిపోయి ఈ కమీషనరేట్ ఏర్పడింది. గతంలో దీనిని సైబరాబాద్ ఈస్ట్ అని పిలిచేవారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ అధికార పరిధి 5091.48 చ.కి.మీ. జనాభా సుమారు 42 లక్షలు. దీని పరిధిలో 42 - పోలీస్ స్టేషన్లు, 2 - మహిళా పోలీస్ స్టేషన్, 1 - సైబర్ క్రైమ్ సెల్, 8 - సహాయక పోలీసు విభాగాలు ఉన్నాయి.[5]
రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ప్రస్తుతం నాలుగు డీసీపీ మండలాలు ఉన్నాయి.