రాజ రాజ చోర (2021 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | హసిత్ గోలీ |
---|---|
నిర్మాణం | టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ |
తారాగణం | శ్రీ విష్ణు మేఘా ఆకాష్ సునయన |
సంగీతం | వివేక్ సాగర్ |
నిర్మాణ సంస్థ | పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ |
విడుదల తేదీ | 2021 ఆగస్టు 19 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
రాజ రాజ చోర 2021లో విడుదలైన తెలుగు సినిమా.[1] పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రానికి హసిత్ గోలీ తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[2][3] ఈ సినిమాలో శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునయన హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 2021 ఆగస్టు 19న విడువలయింది.[4]
భాస్కర్ (శ్రీ విష్ణు) (అజయ్ ఘోష్) కి చెందిన జిరాక్స్ షాప్ లో పని చేస్తూ ఉంటాడు. భాస్కర్ తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ని అని చెప్పుకుని సంజన (మేఘా ఆకాష్) తో ప్రేమలో పడతాడు. అయితే సరిగ్గా అదే సమయంలో భాస్కర్ కి ఇది వరకే విద్య (సునయన)తో పెళ్లి అయిందని అతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలుస్తుంది. భాస్కర్ కి నిజంగానే పెళ్లి అయిందా? భాస్కర్ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి ? అనేదే మిగతా సినిమా కథ.[5]
ఈ సినిమా టీజర్ ను 2021 జూన్ 17న విడుదల చేశారు.[8][9]
ఈ సినిమా 2021 అక్టోబర్ 8నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)