రాజర్షి జనకానంద | |
---|---|
జననం | జేమ్స్ జెస్సీ లిన్ 1892 మే 5 near Archibald, Louisiana |
నిర్యాణము | 1955 ఫిబ్రవరి 20 Borrego Springs, California | (వయసు 62)
క్రమము | సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ |
గురువు | పరమహంస యోగానంద |
తత్వం | క్రియా యోగం |
సంతకం |
రాజర్షి జనకానంద (పూర్వనామం జేమ్స్ జెస్సీ లిన్) (1892 మే 5 - 1955 ఫిబ్రవరి 20) పరమహంస యోగానంద ప్రియ శిష్యుడు. అమెరికాలోని కన్సాస్ నగరం, మిస్సౌరీలో పేరొందిన వ్యాపారవేత్త కూడా. 1932లో ఈయన యోగానందను కలిసినప్పుడు ఈయన స్వయంకృషితో పైకి వచ్చిన కోటీశ్వరుడు. ఆయన యోగానంద స్థాపించిన, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ (SRF)కి ప్రధాన ఆర్థిక సహకారం అందించాడు. ఇంకా అది దీర్ఘకాలం పాటు కొనసాగడానికి సహాయపడ్డాడు. SRF సంస్థ "ఆధ్యాత్మిక" భారతదేశం, "పారిశ్రామిక" అమెరికాల మధ్య సాంస్కృతిక మార్పిడికి తోడ్పడింది. సంతులిత జీవనవిధానమే మేలని చాటి చెప్పింది. జనకానంద ఒక ఆదర్శవంతమైన వ్యాపారవేత్తగానూ, ఒక యోగిగానూ రెండు రకాలుగా ఆదర్శ జీవనం సాగించాడు. ఈయన యోగానంద తర్వాత 1952 నుండి 1955 వరకు దాని అధ్యక్షుడిగా పనిచేశాడు. 62 సంవత్సరాల వయస్సులో మరణించాడు. అతను SRF ఉద్యమానికి సుమారు మూడు మిలియన్ డాలర్ల విరాళాన్ని ఇచ్చాడు. ఈ కారణంగా SRF లో ఆయన అత్యంత గౌరవప్రదమైన స్థానం సంపాదించాడు.
జేమ్స్ జెస్సీ లిన్ అమెరికాలోని దక్షిణ ప్రాంతానికి చెందిన లూసియానాలోని ఆర్చిబాల్డ్ లో జన్మించాడు.[1] వీరిది పేద కుటుంబం.[2] తండ్రి జెస్సీ విలియం లిన్ ఒక సన్నకారు రైతు, తల్లి సలేతియా ఆర్చిబాల్డ్ లిన్.