రాజశేఖర్ | |
---|---|
![]() | |
జననం | లక్ష్మీపురం, తమిళనాడు, భారతదేశం | 1962 ఫిబ్రవరి 4
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1985 - ప్రస్తుతం వరకు |
జీవిత భాగస్వామి | జీవిత |
పిల్లలు | శివాని శివాత్మిక |
తల్లిదండ్రులు |
|
డాక్టర్ రాజశేఖర్ తెలుగు సినిమా నటుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాలలో వివిధ పాత్రలలో నటించాడు.[2][3][4] ఇతని మొదటి చిత్రం వందేమాతరం.
రాజశేఖర్ 1962, ఫిబ్రవరి 4 న తమిళనాడు రాష్ట్రంలోని థేని జిల్లా లక్ష్మీపురంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు వరదరాజన్ గోపాల్, ఆండాళ్ పిళ్ళై.[5] తండ్రి శేఖర్ ఒక పోలీసు అధికారి. రాజశేఖర్ చిన్నతనంలో ఎన్. సి. సి విద్యార్థి. మొదట్లో తండ్రిలాగే పోలీసు అధికారి కావాలనుకున్నా తండ్రి కోరిక మేరకు వైద్యవిద్యనభ్యసించాడు. చెన్నైలో కొంతకాలం ప్రాక్టీసు చేశాడు.[6] సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా వైద్యవృత్తిపై ఆయన ఆసక్తి కొనసాగుతూనే ఉంది.
1991లో సహనటి జీవితను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దురు కూతుర్లు - శివాని, శివాత్మిక. శివాని ఎం. బి. బి. ఎస్ చదువుతోంది. శివాత్మిక సినిమా రంగంలో అడుగు పెట్టింది. 2019లో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ముఖ్య పాత్రల్లో కలిసి నటించిన దొరసాని అనే చిత్రం విడుదలైంది.
రాజశేఖర్ తొలి సినిమా వందేమాతరం. అంకుశం సినిమాలో ఆయన పోషించిన పోలీసు పాత్ర నిజజీవితంలో కొంతమంది పోలీసులను కూడా ప్రభావితం చేసింది.[7] ఆయన ఆవేశపరుడైన యువకుని (యాంగ్రీ యంగ్‌మాన్) పాత్రలకు ప్రసిద్ధి. మొదట్లో ఆయన పాత్రకు సాయి కుమార్ గాత్రదానం చేశాడు.
ఒక దశలో సినిమాలో సరిగా ఆడక స్వంత ఇల్లు కూడా అమ్ముకోవలసి వచ్చింది. గరుడవేగ సినిమా తర్వాత మళ్ళీ నిలదొక్కుకోగలిగాడు. 2019లో ఆయన నటించిన కల్కి సినిమా విడుదలైంది.