రాజస్థాన్ పర్యాటకం, భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రం పర్యాటక ప్రదేశాల్లో చాలా ప్రసిద్ధమైనది. జాతీయం గానూ, అంతర్జాతీయం గానూ కూడా ఎందరో పర్యాటకులు ఇక్కడకి వస్తూంటారు. రాజస్థాన్ లోని చారిత్రక భవంతులు, కోటలు, కళలు, సంస్కృతులు, కట్టడాలు పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం భారతదేశానికి వచ్చే ప్రతి ముగ్గురు విదేశీ పర్యటకుల్లో ఒకరు రాజస్థాన్ ను తప్పక సందర్శిస్తారు.[1][2]
ప్రకృతి సౌందర్యం, చరిత్ర రెండూ కలగలసిన ప్రాంతం రాజస్థాన్. దాంతో పర్యాటక పరిశ్రమ విషయంలో భారతదేశంలో ముందు స్థానంలో నిలిబడింది. ఆ రాష్ట్రం. జైపూర్ లోని ప్యాలెస్ లు, ఉదయ్ పూర్ లోని సరస్సులు, జోధ్ పూర్, బికనీర్, జైసల్మేర్ లలోని ఎడారి కోటలు పర్యాటక కేంద్రాలుగా నిలుస్తున్నాయి. రాష్ట్ర ఆదాయ వనరుల్లో పర్యాటకం 8శాతం ఉందంటేనే అర్ధం చేసుకోవచ్చు. పాతబడిపోయిన, మరుగున పడిపోయిన ఎన్నో కోటల్ని, భవంతల్నీ ప్రస్తుతం సుందరీకరణ చేసి వారసత్వ ప్రదేశాలు గానూ, ముఖ్యంగా హోటల్స్ గానూ తయారు చేస్తున్నారు. ఇప్పుడు రాజస్థాన్ లో పర్యాటకం ఒక పెద్ద ఉపాధి పరిశ్రమగా మరిపోయింది. ఘెవర్ అనేది ఇక్కడి ముఖ్యమైన స్వీట్లలో ఒకటి.
ప్యాలెస్ లు, రాజభవంతులకు రాజస్థాన్ పెట్టింది పేరు. ఈ ప్యాలస్ ల చుట్టూనే ప్రస్తుతం రాజస్థాన్ పర్యాటకం ఎక్కువగా తిరుగుతోంది.[3]రాజస్థాన్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు: