రాజా చెయ్యివేస్తే | |
---|---|
![]() Theatrical release poster | |
దర్శకత్వం | ప్రదీప్ చిలుకూరి |
స్క్రీన్ ప్లే | ప్రదీప్ చిలుకూరి |
కథ | ప్రదీప్ చిలుకూరి |
నిర్మాత | సాయి కొర్రపాటి |
తారాగణం | నారా రోహిత్ తారకరత్న ఇషా తల్వార్ |
ఛాయాగ్రహణం | సామల భాస్కర్ |
సంగీతం | సాయి కార్తీక్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 29 ఏప్రిల్ 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రాజా చెయ్యివేస్తే 2016 తెలుగు సినిమా.[1] [2][3][4]
విన్సెంట్ మాణిక్ అలియాస్ మాణిక్ (తారకత్న) కరుడుగట్టిన నేరస్థుడు. అతడు చేసిన హత్యలకు ఎలాంటి ఆధారాలు ఉండకుండా చేయడం అతడి ప్రత్యేకత. చూసినవారు కూడా ప్రాణ భయంతో నోరు విప్పరు. దీనికితోడు రాజకీయ అండ ఉండటంతో పోలీసులు కూడా ఇతడ్ని ఏమీ చేయలేకపోతారు. అయితే ఇతడి వల్ల నష్టపోయిన వారు మాత్రం లోలోపలే పగతో రగిలిపోతుంటారు. మరోవైపు ఇంజనీరింగ్ చదివిన రాజారామ్ (రోహిత్) సినిమా దర్శకుడు కావాలని సహాయ దర్శకుడిగా పనిచేస్తూ తన ప్రయత్నాలు చేస్తుంటాడు. ప్రేయసి (ఇషా తల్వార్), ముగ్గురు స్నేహితులతో సరదాగా కాలం గడిపేస్తున్న ఇతడికి మాణిక్‌ని చంపాల్సిందిగా బెదిరిస్తూ ఓ కొరియర్ వస్తుంది. ఆ కొరియర్ పంపిందెవరు.. రాజారామ్‌కి అతడికి సంబంధమేంటి.. చివరికి రాజారామ్ ఏం చేశాడు..? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమా చూడాలి.
రాజారామ్‌గా రోహిత్ ఆకట్టకుంటాడు. స్టైలిష్ విలన్‌గా కనపడిన తారకరత్న ఆ పాత్రని అంతగా పండించలేకపోయాడు. సినిమాలో హీరోయిన్ పాత్రే కీలకం. అయితే ఇషా ‘తల్వార్’ పదును రొమాంటిక్ సన్నివేశాలకే పరిమితమైంది. ఆమె అన్నగా నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఓ పాత్రలో తళుక్కుమన్నారు. సినిమా మొత్తానికి కామెడీ ఏదైనా ఉంది అంటే కారుమంచి రఘు చేసిన ఒకటి రెండు సన్నివేశాలే. శివాజీరాజా, శశాంక్, రవివర్మ తదితర నటులు ఉన్నంతలో తమ పాత్రలను పండించే ప్రయత్నం చేశారు.