రాజు సుందరం (జననం 1968 మార్చి 7) సినిమా నృత్య దర్శకుడు, నటుడు. ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాలకు పనిచేశాడు. అతను జీన్స్ (1998), 123 (2002), ఐ లవ్ యు డా (2002), క్విక్ గన్ మురుగన్ (2009) చిత్రాలలో నటించాడు. ఇతని తండ్రి సుందరం మాస్టారు కూడా నృత్య దర్శకుడే. ఈయన ఇద్దరు తమ్ముళ్ళు ప్రభుదేవా, నాగేంద్ర ప్రసాద్.[1]
అతను చిత్రం జనతా గ్యారేజ్ (2016) లోని ప్రణామం ప్రణామం పాటకు గాను ఉత్తమ కొరియోగ్రఫీకి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. [2]
రాజు సుందరం | |
---|---|
జననం | |
వృత్తి | నృత్య దర్శకుడు దర్శకుడు నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1992–ప్రస్తుతం |
తల్లిదండ్రులు |
|
బంధువులు | ప్రభు దేవా (తమ్ముడు) నాగేంద్ర ప్రసాద్ (తమ్ముడు) |
సుందరం తన తండ్రి సుందరం మాస్టర్ కి సహాయకుడిగా కొరియోగ్రాఫర్ జీవితం ప్రారంభించాడు. మణిరత్నం సినిమాలు రోజా (1992), ఆసై (1995) లలో పనిచేసాడు. తన సోదరుడు ప్రభుదేవా నటించిన పాటలలో అతిథి పాత్రలలో కనిపించాడు. ఈ జంట శంకర్ ప్రారంభ చిత్రాలలో జెంటిల్‌మేన్ (1993), ప్రేమికుడు (1994) లలో కనిపించాడు. [3] కొన్ని కన్నడ చిత్రాలకు ప్రధాన కొరియోగ్రాఫర్ అయిన తరువాత, అతని మొదటి నృత్య దర్శకత్వ అవకాశం మణిరత్నం సినిమా తిరుడా తిరుడా (1993) ద్వారా వచ్చింది, అక్కడ అతనికి మూడు పాటలకు నృత్యాలు రూపొందించే అవకాశం లభించింది. [4] తరువాత అతను తమిళ దర్శకులు మణిరత్నం, శంకర్ సినిమాలకు కొరియోగ్రాఫర్ అయ్యాడు. అమితాబ్ బచ్చన్ ఆల్బమ్ అబి బేబీ (1996) లో పనిచేశాడు.
శంకర్ తన రొమాంటిక్ కామెడీ జీన్స్ (1998) లో సుందరం నటనావకాశం ఇచ్చాడు. అక్కడ సుందరం పూర్తి నిడివి గల పాత్రను పోషించాడు. ఐ లవ్ యు డా (2002) లో హీరో పాత్ర పోషించాడు. హిందూ పత్రిక ఆ చిత్రం గురించి రాస్తూ, "సీరియస్ నటన అతడికి సరిపడద"ని రుజువైంది అని రాసింది. [5] అతను తన సోదరులతో కలిసి తమిళం, తెలుగు, కన్నడ భాషలలో తీసిన చిత్రం వన్ టూ త్రీ (2003) లో నటించాడు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందనలొచ్చాయి. బాక్సాఫీస్ పెద్దగా ఆడలేదు. [6] అప్పటి నుండి అతను ప్రధానంగా కొరియోగ్రాఫరు గానే పనిచేశాడు. జీవా దర్శకత్వంలో వచ్చిన నీవల్లే నీవల్లే (2007) లో, తమిళ చిత్రం ఎంగెయుం కాదల్ (2011), తెలుగు చిత్రం యాక్షన్ 3 డి (2013) ల్లో కామిక్ పాత్రల్లో నటించాడు.