రాజేశ్ కృష్ణన్ | |
---|---|
![]() | |
జననం | బెంగుళూరు, కర్ణాటక | 3 జూన్ 1973
వృత్తి | నేపథ్య గాయకుడు నటుడు సంగీతకారుడు |
ఎత్తు | 6 అ. 1 అం. (185 cమీ.) |
పురస్కారాలు | నంది పురస్కారాలు సైమా పురస్కారాలు |
రాజేశ్ కృష్ణన్ కర్ణాటక కు చెందిన నేపథ్య గాయకుడు, నటుడు. 1991 లో వచ్చిన గౌరి గణేశ అనే చిత్రంతో తన పాటల ప్రస్థానాన్ని ప్రారంభించిన రాజేశ్ కన్నడ సినిమాల్లో సుమారు 4000కి పైగా పాటలు పాడాడు. తెలుగు, తమిళ భాషల్లో సుమారు 1000 కి పైగా పాటలు పాడాడు. అంతే కాక అనేక దైవభక్తి గీతాలు, వ్యాపారాత్మక సంగీతంలో పాలు పంచుకున్నాడు.
నటుడు ఎ. వి. ఎస్. దర్శకత్వంలో 2003 లో వచ్చిన ఓరి నీ ప్రేమ బంగారం కానూ అనే చిత్రంలో కథానాయకుడిగా నటించాడు.[1]
రాజేశ్ కృష్ణన్ అసలు పేరు రాజేశ్వర సాయిసుబ్రహ్మణ్య నాగరాజ కృష్ణన్. 1973, జూన్ 3 న బెంగళూరు లో జన్మించాడు. తల్లి మీరా కృష్ణన్ దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నాడు. కన్నడ సంగీత దర్శకుడైన హంసలేఖ దగ్గర ట్రాక్ సింగర్ గా పనిచేశాడు.
రాజేశ్ ముందుగా సౌమ్య రావు అనే గాయనిని వివాహం చేసుకున్నాడు. ఆమెతో విడిపోయిన తర్వాత హరిప్రియ అనే డెంటిస్టును వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం కూడా ఎంతోకాలం నిలవలేదు. తర్వాత రమ్య వశిష్ట అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.[2][3]