రకం | చిత్ర నిర్మాణం సినిమా పంపిణీ |
---|---|
పరిశ్రమ | వినోద పరిశ్రమ |
స్థాపన | 1981 |
స్థాపకుడు | కమల్ హాసన్ |
ప్రధాన కార్యాలయం | , భారతదేశం |
కీలక వ్యక్తులు | కమల్ హాసన్ చంద్రహాసన్ |
ఉత్పత్తులు | చలన చిత్రాలు |
రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ (ఆంగ్లం: Raaj Kamal Films International) అనేది కమల్ హాసన్ స్థాపించి, సారథ్యం వహిస్తున్న భారతీయ చలనచిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థ. మొదట కమల్ హాసన్ సోదరులు చంద్రహాసన్, చారుహాసన్లు కలసి రాజా పార్వై (1981) అనే చిత్రం "హాసన్ బ్రదర్స్" బ్యానర్‌పై నిర్మించారు. ఈ తమిళ సినిమాను సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్ హాసన్, మాధవి హీరోహీరోయిన్లుగా తెలుగులో అమావాస్య చంద్రుడు (1981) నిర్మించారు. ఆ తరువాత ఈ బ్యానర్ పేరును రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌గా మార్చారు.[1] తెలుగులో ద్రోహి (1995), ఈనాడు (2009), చీకటిరాజ్యం (2015) మొదలైన చిత్రాలు నిర్మించారు.
రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ, సోనీ ఫిలిమ్స్ పిక్చర్స్ సంస్థ సంయుక్తంగా తమిళంలో చిత్రాలు నిర్మించడానికి 2022 జనవరిలో ఒప్పందం కుదుర్చుకున్నాయి.[2] ఈ సంస్థలు తొలి ప్రయత్నంగా రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో శివకార్తికేయన్ కథానాయకుడిగా చిత్రం నిర్మాణం చేపట్టారు.
S.no | Ceremony | Year | Category | Nominee | Result |
---|---|---|---|---|---|
1 | జాతీయ చలనచిత్ర అవార్డులు | 1992 | తమిళంలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం | తేవర్ మగన్ | గెలుపు |
2 | తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు | 1992 | ఉత్తమ చిత్రంగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం | తేవర్ మగన్ | గెలుపు |
3 | ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ | 1989 | ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తమిళం | అపూర్వ సగోధరార్గల్ | గెలుపు |
4 | సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డులు | 1989 | ఉత్తమ చిత్రంగా సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డు – తమిళం | అపూర్వ సగోధరార్గల్ | గెలుపు |
5 | 1992 | ఉత్తమ చిత్రంగా సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డు – తమిళం | తేవర్ మగన్ | గెలుపు | |
6 | 1995 | ఉత్తమ చిత్రంగా సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డు – తమిళం | కురుతిపునల్ | గెలుపు | |
7 | పుచోన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ (దక్షిణ కొరియా) | 2004 | ఉత్తమ ఆసియా చిత్రంగా అంతర్జాతీయ అవార్డు | విరుమాండి | గెలుపు |
8 | లాస్ ఏంజిల్స్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ | 2015 | ఉత్తమ చిత్రం | ఉత్తమ విలన్ | గెలుపు |
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)