ఉత్తరాఖండ్ రెండవ రాజ్ భవన్ లేదా ఉత్తరాఖండ్ గవర్నర్ హౌస్ నైనిటాల్లో ఉంది.ఇది ఉత్తరాఖండ్ గవర్నరు వేసవి విడిది కేంద్రం.స్వాతంత్ర్యానికి పూర్వం, నైనిటాల్ యునైటెడ్ ప్రావిన్సెస్ వేసవి రాజధానిగా పనిచేసింది. స్కాటిష్ కోటలాగా నిర్మించిన ఈ భవనానికి "ప్రభుత్వ గృహం" అని నామకరణం చేయబడింది. రాజ్‌భవన్‌ను బ్రిటిష్ వారు వాయువ్య ప్రావిన్సుల గవర్నరు నివాసంగా నిర్మించారు.[1]1897 ఏప్రిల్‌లో రాజ్‌భవన్ నిర్మాణం ప్రారంభమై రెండేళ్లులో నిర్మాణం పూర్తిచేసారు.ది యూరోపియన్ నమూనాలో, గోతిక్ వాస్తుశిల్పం ఆధారంగా నిర్మించబడింది.నైనిటాల్ వద్ద రాజ్ భవన్ రూపకర్తలు ఆర్కిటెక్ట్ స్టీవెన్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎఫ్.ఒ.డబ్యు.ఓర్టెల్. స్వాతంత్య్రానంతరం రాజ్‌భవన్‌గా పేరు మార్చారు.[1]
రాజ్ భవన్ ఎస్టేట్ 220 ఎకరాల విస్తీర్ణంలో 45 ఎకరాల స్థలంలో గోల్ఫ్ కోర్స్‌తో విస్తరించి ఉంది. రాజ్ భవన్ గోల్ఫ్ కోర్స్,1936లో నిర్మించబడింది.ఇది భారతదేశం లోని పాతకాలపు గోల్ఫ్ కోర్స్‌లలో ఇది ఒకటి.ఇది ఇండియన్ గోల్ఫ్ యూనియన్‌కు అనుబంధంగా ఉంది.స్వాతంత్య్రానంతర కాలంలో, ఉత్తరప్రదేశ్ మొదటి గవర్నర్ సరోజినీ నాయుడు ఈ చారిత్రాత్మక స్మారక చిహ్నంలో మొదటి నివాసిగా గడిపారు. [2]