రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు భారతదేశ పార్లమెంటు ఎగువ సభలో ప్రతిపక్షానికి నాయకత్వం వహించే సభ్యుడు . రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వంలో లేని రాజ్యసభలో అతిపెద్ద రాజకీయ పార్టీ పార్లమెంటరీ చైర్‌పర్సన్. 1987లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్యాంనందన్ మిశ్రాను రాజ్యసభలో గుర్తింపు పొందిన మొదటి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నియమితుడయ్యాడు. 1977లో భారత పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష పార్టీకి గుర్తింపునిచ్చే చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు లభించాలంటే సభలోని మొత్తం స్థానాల్లో 1/10వ వంతు స్థానాలు పొంది ఉండాలి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతకు కేంద్ర కేబినెట్ మంత్రికి లభించే వసతి, హోదా లభిస్తాయి. ఈ చట్టం చేసిన అనంతరం రాజ్యసభలో గుర్తింపు పొందిన మొదటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కమలాపతి త్రిపాఠి (1977) నిలిచాడు.
నెం | ఫోటో | పేరు | పదవీకాలం[1] | ప్రధాన మంత్రి | పార్టీ | |||
---|---|---|---|---|---|---|---|---|
– | ఖాళీ | 13 మే 1952 | 17 డిసెంబర్ 1969 | 17 సంవత్సరాలు, 218 రోజులు | అధికారిక ప్రతిపక్షం లేదు | |||
1 | శ్యామ్ నందన్ ప్రసాద్ మిశ్రా | 18 డిసెంబర్ 1969 | 11 మార్చి 1971 | 1 సంవత్సరం, 83 రోజులు | ఇందిరా గాంధీ | భారత జాతీయ కాంగ్రెస్ (O) | ||
2 | ఎంఎస్ గురుపాదస్వామి | 24 మార్చి 1971 | 2 ఏప్రిల్ 1972 | 1 సంవత్సరం, 9 రోజులు | ||||
– | ఖాళీ | 2 ఏప్రిల్ 1972 | 30 మార్చి 1977 | 4 సంవత్సరాలు, 362 రోజులు | అధికారిక ప్రతిపక్షం లేదు | |||
3 | కమలాపతి త్రిపాఠి | 30 మార్చి 1977 | 15 ఫిబ్రవరి 1978 | 322 రోజులు | మొరార్జీ దేశాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
4 | భోలా పాశ్వాన్ శాస్త్రి | 24 ఫిబ్రవరి 1978 | 23 మార్చి 1978 | 27 రోజులు | ||||
(3) | కమలాపతి త్రిపాఠి | 23 మార్చి 1978 | 8 జనవరి 1980 | 1 సంవత్సరం, 291 రోజులు | మొరార్జీ దేశాయ్ చరణ్ సింగ్ | |||
5 | ఎల్‌కే అద్వానీ | 21 జనవరి 1980 | 7 ఏప్రిల్ 1980 | 77 రోజులు | ఇందిరా గాంధీ | జనతా పార్టీ | ||
– | ఖాళీ | 7 ఏప్రిల్ 1980 | 18 డిసెంబర్ 1989 | 9 సంవత్సరాలు, 255 రోజులు | ఇందిరా గాంధీ | అధికారిక ప్రతిపక్షం లేదు | ||
6 | పి. శివ శంకర్ | 18 డిసెంబర్ 1989 | 2 జనవరి 1991 | 1 సంవత్సరం, 15 రోజులు | వీపీ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
(2) | ఎంఎస్ గురుపాదస్వామి | 28 జూన్ 1991 | 21 జులై 1991 | 23 రోజులు | పివి నరసింహారావు | జనతా దళ్ | ||
7 | జైపాల్ రెడ్డి | 22 జులై 1991 | 29 జూన్ 1992 | 343 రోజులు | ||||
8 | సికందర్ భక్త్ | 7 జులై 1992 | 16 మే 1996 | 3 సంవత్సరాలు, 314 రోజులు | భారతీయ జనతా పార్టీ | |||
9 | శంకర్రావు చవాన్ | 23 మే 1996 | 1 జూన్ 1996 | 9 రోజులు | అటల్ బిహారీ వాజ్‌పేయి | భారత జాతీయ కాంగ్రెస్ | ||
(8) | సికందర్ భక్త్ | 1 జూన్ 1996 | 19 మార్చి 1998 | 1 సంవత్సరం, 291 రోజులు | హెచ్.డి.దేవెగౌడఐ.కె.గుజ్రాల్ | భారతీయ జనతా పార్టీ | ||
10 | మన్మోహన్ సింగ్ | 21 మార్చి 1998 | 22 మే 2004 | 6 సంవత్సరాలు, 62 రోజులు | అటల్ బిహారీ వాజ్‌పేయి | భారత జాతీయ కాంగ్రెస్ | ||
11 | జస్వంత్ సింగ్ | 3 జూన్ 2004 | 16 మే 2009 | 4 సంవత్సరాలు, 347 రోజులు | మన్మోహన్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | ||
12 | అరుణ్ జైట్లీ | 3 జూన్ 2009 | 26 మే 2014 | 4 సంవత్సరాలు, 357 రోజులు | ||||
13 | గులాం నబీ ఆజాద్ | 8 జూన్ 2014 | 15 ఫిబ్రవరి 2021 | 6 సంవత్సరాలు, 252 రోజులు | నరేంద్ర మోదీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
14 | మల్లికార్జున్ ఖర్గే | 16 ఫిబ్రవరి 2021[2] | 1 అక్టోబర్ 2022[3] | 1 సంవత్సరం, 227 రోజులు | ||||
17 December 2022 | rowspan="2" |Incumbent | 1 సంవత్సరం, 348 రోజులు |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)