రాజ్యోత్సవ ప్రశస్తి | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
ఎలాంటి పురస్కారం | పౌర | |
విభాగం | సాహిత్యం,సంగీతం,నృత్యం, నాటకం, కళ, పత్రికోద్యమం, క్రీడలు, వైద్యం, విద్య, వ్యవసాయం, సమాచార, శాస్త్ర సాంకేతిక విద్యలు | |
వ్యవస్థాపిత | 1966 | |
మొదటి బహూకరణ | 1966 | |
క్రితం బహూకరణ | 2017 | |
మొత్తం బహూకరణలు | 2400 (సంస్థలు, వ్యక్తిగత పురస్కారాలు కలిపి) | |
బహూకరించేవారు | కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం | |
నగదు బహుమతి | ₹ 1,00,000 | |
Award Rank | ||
కర్ణాటకరత్న ← రాజ్యోత్సవ ప్రశస్తి → |
రాజ్యోత్సవ ప్రశస్తి అనేది కర్ణాటక రాష్ట్ర అవతరణ సందర్భంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే పురస్కారాలు. వివిధ రంగాలలో ప్రముఖులను ఈ పురస్కారంతో సత్కరిస్తారు.
ప్రతి యేటా నవంబరు 1 న బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పురస్కారాలను బహూకరిస్తారు. ఈ పురస్కారం క్రింద ఒక లక్ష రూపాయల నగదు, 20-25 గ్రాముల బరువు ఉన్న స్వర్ణపతకం, ప్రశంసాపత్రం, జ్ఞాపిక, శాలువాలను ఇస్తారు. ఇవి కాకుండా అర్హులైన పురస్కార గ్రహీతలకు ప్రభుత్వం తరఫున ఇంటి స్థలాలను కూడా ఇస్తారు.[1]
రాజ్యోత్సవ ప్రశస్తిని 1966 నుండి ఇవ్వడం ప్రారంభించారు. సామాన్యంగా బెంగళూరులోని "రవీంద్ర కళాక్షేత్ర"లో ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం ఉంటుంది. ఈ పురస్కారాన్ని ఈ క్రింది విభాగాలలో విశేషమైన కృషి చేసినవారికి ఈ పురస్కారం ఇస్తారు:
కళలు (సాహిత్యం, నాటకం, సినిమా, సంగీతం, నృత్యం, జానపదం, యక్షగానం, బయలునాటకం, శిల్పం, చిత్రలేఖనం), సమాజసేవ, పత్రికలు, మీడియా, క్రీడలు, వైద్యం, విద్య, వ్యవసాయం, శాస్త్ర సాంకేతిక రంగాలు.
కొన్ని సంవత్సరాలలో వివిధ కారణాల వల్ల రాజ్యోత్సవ ప్రశస్తిని ప్రకటించలేదు.[2][3][4]
రాజ్యోత్సవ ప్రశస్తిని అందుకున్న వారిలో రట్టిహళ్లి నాగేంద్రరావు, హెచ్.నరసింహయ్య, బి.ఆర్.పంతులు, గిరీష్ కర్నాడ్, మాస్తి వెంకటేశ అయ్యంగార్, రాజ్‌కుమార్, ఉడుపి రామచంద్రరావు, ప్రకాష్ పడుకోనె,జోళదరాశి దొడ్డనగౌడ, చింతామణి నాగేశ రామచంద్ర రావు, పుట్టణ్ణ కణగాల్, కుమార్ గాంధర్వ, యు.ఆర్.అనంతమూర్తి, భీమ్‌సేన్ జోషి, ఆరతి, ఆర్.కె.లక్ష్మణ్, రోజర్ బిన్నీ, సయ్యద్ కిర్మాణీ, సతీష్ ధావన్, శివరామ కారంత్, ఆర్.కే. నారాయణ్, జి.వి.అయ్యర్, తిక్కవరపు పఠాభిరామిరెడ్డి, బి.సరోజాదేవి, గుండప్ప విశ్వనాథ్, విష్ణువర్ధన్, అంబరీష్, శంకర్ నాగ్ (మరణానంతరం), అశ్వని నాచప్ప, ఎం.ఎం.కల్బుర్గి, పండరీబాయి, భారతి, షైనీ విల్సన్, బ్రిజేష్ పటేల్, అనిల్ కుంబ్లే, పి.బి.శ్రీనివాస్, జవగళ్ శ్రీనాథ్, మహేష్ భూపతి, అజీమ్ ప్రేమ్‌జీ, మంజు భార్గవి, ఎం.ఎ.నరసింహాచార్, మైసూర్ నాగమణీ శ్రీనాథ్, ఎం.ఎస్.షీలా, సుమ సుధీంద్ర, మైసూర్ ఎం.నాగరాజ, హెచ్.ఆర్.కేశవమూర్తి, వైశాలి కాసరవల్లి, సురేష్ అర్స్, సుహాస్ గోపీనాథ్ మొదలైన ప్రముఖులు ఉన్నారు.
విజేత | రంగం | టిప్పణి |
---|---|---|
నాగమోహన్ దాస్ | న్యాయం | |
బసవరాజ సబరద | సాహిత్యం | |
వైదేహి | సాహిత్యం | |
మాహెర్ మన్సూర్ | సాహిత్యం | |
హనుమాక్షి గోగి | సాహిత్యం | |
డి.ఎస్.నాగభూషణ | సాహిత్యం | |
బేలూరు కృష్ణమూర్తి | రంగస్థలం | |
గూడూరు మమత | రంగస్థలం | |
సి.కె.గుండణ్ణ | రంగస్థలం | |
అదరగుంచి శివప్ప భరమప్ప | రంగస్థలం | |
ఎ.వరలక్ష్మి | రంగస్థలం | |
ఎన్.వై.పుట్టణ్ణయ్య | రంగస్థలం | |
కాంచన | సినిమా–బుల్లితెర | |
'ముఖ్యమంత్రి'చంద్రు | సినిమా–బుల్లితెర | |
హాసన్ రఘు | సినిమా–బుల్లితెర | |
లలిత జి.రావు | సంగీతం - నృత్యం | |
రాజప్రభు ధోత్రె | సంగీతం - నృత్యం | |
రాజేంద్ర సింగ్ పవార్ | సంగీతం - నృత్యం | |
కిత్తూర్ వీరేశ్ | సంగీతం - నృత్యం | |
ఉళ్ళాల మోహన్ కుమార్ | సంగీతం - నృత్యం | |
తంబూరి జవరయ్య | జానపదం | |
శావమ్మ | జానపదం | |
గొరవర మైలారప్ప | జానపదం | |
తాయమ్మ | జానపదం | |
మానప్ప ఈరప్ప లోహార్ | జానపదం | |
కృష్ణప్ప గోవిందప్ప పురదర | జానపదం | |
కరడిగుడ్డ డెంగమ్మ | జానపదం | |
శివరామ జోగి | యక్షగానం - బయలు నాటకం | |
బళ్ళూరు కృష్ణయాజి | యక్షగానం - బయలు నాటకం | |
మాదర ఈశ్వరవ్వ హుచ్చవ్వ | యక్షగానం - బయలు నాటకం | |
కె.పంపాపతి (సారథి) | యక్షగానం - బయలు నాటకం | |
మీరానాయక్ | సమాజ సేవ | |
సయ్యద్ షా ఖుస్రూ | సమాజ సేవ | |
రమేశ్ హల్గలి | సమాజ సేవ | |
రామచంద్ర గుహ | సంకీర్ణం | |
ఎస్.సయ్యద్ అహ్మద్ | సంకీర్ణం | |
హెచ్.బి.మంజునాథ్ | సంకీర్ణం | |
సీతారాం జాగీర్దార్ | సంకీర్ణం | |
బి.గంగాధరమూర్తి | సంకీర్ణం | |
జి.ఎల్.ఎన్.సింహా | చిత్రకళ - శిల్పకళ | |
మ్యాగేరి శ్యాణమ్మ | చిత్రకళ - శిల్పకళ | |
హొన్నప్పాచార్య | చిత్రకళ - శిల్పకళ | |
మనోహర్ కె.పత్తార | చిత్రకళ - శిల్పకళ | |
బిసలయ్య | వ్యవసాయం-పర్యావరణం | |
అబ్దుల్ ఖాదర్ ఇమామ్ సాబ్ | వ్యవసాయం-పర్యావరణం | |
ఎస్.ఎం.కృష్ణప్ప | వ్యవసాయం-పర్యావరణం | |
సి.యతిరాజు | వ్యవసాయం-పర్యావరణం | |
కుసుమా శాన్‌భాగ్ | మీడియా | |
ఎ.సి.రాజశేఖర్ (అబ్బూరు) | మీడియా | |
గోరంట్ల విఠ్ఠప్ప | మీడియా | |
రాకె రామదేవ్ | మీడియా | |
ఎం.ఆర్.శ్రీనివాసన్ | శాస్త్ర సాంకేతిక రంగాలు | |
మునివెంకటప్ప సంజప్ప | శాస్త్ర సాంకేతిక రంగాలు | |
లీలావతీ దేవదాస్ | వైద్యం | |
శేఖర్ నాయక్ | క్రీడలు | |
వి.ఆర్.రఘునాథ్ | క్రీడలు | |
సహనాకుమారి | క్రీడలు | |
లీలావతీ దేవదాస్ | క్రీడలు | |
పి.శ్యామరాజు | విద్య | |
బి.ఎ.రెడ్డి | ఇంజనీరింగ్ | |
రోనాల్డ్ కోలార్సో | విదేశం |