రాణి చంద్ర | |
---|---|
జననం | 1949 జూన్ 2 ఫోర్ట్ కొచ్చి, ట్రావెన్‌కోర్-కొచ్చిన్, భారతదేశం |
మరణం | 1976 అక్టోబరు 12 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 27)
బంధువులు | చిప్పీ రంజిత్ (మేనకోడలు) |
రాణి చంద్ర (1949 జూన్ 2 - 1976 అక్టోబరు 12) భారతీయ నటి. కేరళలోని కొచ్చిలో జన్మించిన ఆమె మలయాళం పాటు తమిళ సినిమాలలోనూ నటించింది. ఆమె మిస్ కేరళ టైటిల్ విజేత.[1] ఆమె మలయాళంలో నెల్లు (1974), స్వప్నదానం (1976), తమిళంలో భద్రకాళి (1976) వంటి అనేక మైలురాయి చిత్రాలలో నటించింది. ఆమె 1976లో విమాన ప్రమాదంలో మరణించింది.
ఆమె ట్రావెన్‌కోర్-కొచ్చిన్ (ప్రస్తుతం కేరళ)లోని ఫోర్ట్ కొచ్చిలో చంద్రన్, కాంతిమతిలకి 1949 జూన్ 2న జన్మించింది. ఆమెకు నలుగురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నారు. ఆమె ఎర్నాకులంలోని సెయింట్ థెరిసెస్ కళాశాల నుండి డిగ్రీ పూర్తిచేసింది. ఆమె 1972లో మిస్ కేరళగా ఎంపికైంది.[2] ఆమె ఒక నృత్య బృందాన్ని కలిగి ఉంది.
ఆమె నటి శిల్పా(చిప్పీ రంజిత్) సోదరుడు షాజీ కూతురు.[3]
ఆమె మొదటి చిత్రం అంజుసుందరికళ్ ప్రేక్షకుల నుండి పెద్ద ఎత్తున ఆదరణ పొందింది. అదే కోవలో ఉల్సవం, కడరుమాసం, నెల్లు, స్వప్నదానం, ఊంజల్, అలింగనం, అభినందనం, సింధూరం, తిరుమధురం, అనురాగం వంటి మరెన్నో చిత్రాలు ఆమె నటించినవి ఉన్నాయి. స్వప్నదానం చిత్రానికి ఉత్తమ నటిగా ఆమె కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. భద్రకాళి చిత్రంలో బాగా పాపులర్ అయిన తమిళ సినిమా పాటలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.
1976లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 171 క్రాష్‌లో రాణిచంద్ర, ఆమె తల్లి, ముగ్గురు సోదరీమణులు చనిపోయారు. వారు మిడిల్ ఈస్ట్‌లో ఒక నృత్య ప్రదర్శన నుండి తిరిగి వస్తున్నారు. వారు ప్రయానిస్తున్న విమానం మంటలు చెలరేగి వారు, ఆమె సంగీత బృందం సభ్యులు, అందులో ఉన్న ప్రతి ఒక్కరూ మరణించారని సమాచారం.
ఆమె మరణంతో భద్రకాళి చిత్రం అసంపూర్తిగా మిగిలిపోయింది. అయినా పూర్తిచేసి విడుదల చేసారు.
1975 - ఉత్తమ నటి - స్వప్నదానం[4]