రాధిక కుమారస్వామి | |
---|---|
జననం | |
వృత్తి | నటి, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 2002–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | 1 |
రాధిక కుమారస్వామి (జ. 1986 నవంబరు 11 [3][4]), భారతీయ సినిమా నటి, నిర్మాత.[5] ఆమె కన్నడ చిత్ర పరిశ్రమలో సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించి 2000లలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందింది.[6]
రాధికా తన సినిమా ప్రస్థానాన్ని కన్నడ చిత్రం "నీల మేఘ శ్యామ"(2002) తో ప్రారంభించింది. ఆ చిత్రంలో నటించినపుడు ఆమె 9వ తరగతి మాత్రమే పూర్తిచేసింది. [3] ఆమె నటించిన సినిమాలలో మొదటగా విడుదల అయినది విజయ్ రాఘవేంద్ర సరసన నటించిన "నినగాగి". తరువాత ఆమె శివరాజ్‌కుమార్ తో "తవరిగె బా తంగి" సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను అందించాయి. [3]2003 లో ఆమె కన్నడ చిత్రసీమలో ఐదు చిత్రాలలో కనిపించింది. వాటిలో హేమంత్ హెగ్డే దర్శకత్వంలోణి "ఊ లా లా:హుడుగిగాగి"[7]; ఎస్. పి. చరణ్, యోగ్రాజ్ భట్ లకు మొదటి సినిమా కూదా "మణి". దీనిలో ఆమె ఒక వేశ్య కుమార్తెగా నటించింది. [3] తరువాత నటించిన "మనె మగలు", "తయి ఇల్లడ తబ్బాలి" చిత్రాలు వాణిజ్య పరంగా వైఫల్యాలు పొందాయి.[8] ఈ చిత్రాలలో పేలవమైన బాక్స్ ఆఫీస్ రిటర్న్ ఉన్నప్పటికీ, ఆమె నటించిన "తాయి ఇల్లడ తబ్బాలి" చిత్రంలోని గౌరి పాత్ర లోని నటనకు కర్నాటక రాష్ట్ర ఉత్తమ నటిగా సినిమా పురస్కారాన్ని అందుకుంది.[9][10]
కన్నడ చిత్రాలలో వరుస వైఫల్యాలు చెందడం వలన ఆమె తమిళ చిత్రసీమలోనికి ప్రవేశించి, ఐదు చిత్రాలలో నటించింది. [11] ఆమె నటించిన మొదటి తమిళ చిత్రం "ఇయర్కాయ్" (2003). ఈ చిత్రానికి సినిమా పురస్కారాలు వచ్చాయి. హిందూ పత్రిక తన సమీక్షలో "ఉద్రిక్త, పరిపక్వత, అమాయకురాలైన నాన్సీ పాత్రకు ఆమె సరైనది" అని పేర్కొంది. [12] 2005లో ఆమె నటించిన నాలుగు చిత్రాలలో మూడు సినిమాలు "రిషిని", "మసాలా", "ఆటోశంకర్" లలో మరో ప్రధాన మహిళా పాత్రతో ఆమె నటించింది. [13] 2005 లో ఆమె నటించిన చివరి చిత్రం "తవరిగె బా తంగి" లో ఆమె శివరాజ్ కుమార్ కు సోదరిగా నటించింది. [14] తరువాత సంవత్సరం ఆమె ఐదు కన్నడ, ఒక తమిళ చిత్రంలో నటించింది. ఆమె నటించిన "హతవిధి" పై రెడిఫ్ డాట్ కాం చేసిన సమీక్షలో ""ఇది రవిచంద్రన్ చిత్రం అయినప్పటికీ, రాధిక యొక్క గొప్పతనం, ఆమె అద్భుతమైన ప్రదర్శనను చూపిస్తుంది, ఆమె భావోద్వేగాలు పరిపూర్ణమైనవి, ఆమె తెరపై బాగా అందంగా ఉంది." తెలియజేసింది.[15] చాలాకాలం చిత్రసీమకు దూరమైన తరువాత ఆమె 2008లో "నవశక్తి వైభవం" అనే భక్తి చిత్రంలో దేవత పాత్రలో నటించింది.
ఆమె సినిమా పరిశ్రమలో నిర్మాతగా, పంపిణీదారురాలిగా కూడా పనిచేసింది. ఆమె ఉపేంద్ర, దర్శని లతో పాటు నటించిన తన స్వంత చిత్రం "అనతరు" (2007) పంపిణీ హక్కులను పొందింది.[16] 2008లో ఆమె తన చిత్రం "ఈశ్వర్" కు హక్కులు కొనుగోలు చేసింది. ఇది పునరుద్ధరించబడి[17] [18]2007 లో "నరసింహ" గా విడుదల అయింది. [17][19] తరువాత ఆమె తన కుమార్తె పేరుతో "షమిక ఎంటర్ప్రైజెస్" పేరుతో ఒక స్టుడియోను స్థాపించి, "లక్కీ" సినిమాకు దర్శకత్వం వహించింది.
2013లో ఆమె నిర్మించిన "స్వీటీ నాన్న జోడి" చిత్రంలో నటించింది. [20] ఆమె తెలుగు లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2014 విడుదలైన పౌరాణిక చిత్రం "అవతారం" లో నటించింది. [21]
రాధిక 2000 నవంబరు 26 న కటీల్ లోని శ్రీ దుర్గా పరమేశ్వరి దేవాలయంలో రతన్ కుమార్ ను వివాహమాడింది. [22] 2002 ఏప్రిల్ లో రతన్ కుమార్ రాధిక తండ్రి రాధికక్లు వివాహం జరిగిన విషయం "ఆమె కెరీర్ ను అంతమవుతుంది" అనే భయంతో ఆమెను అపహరించాడనే ఆరోపణలతో కేసు పెట్టాడు. [23][24] కొన్ని రోజుల తరువాత, రాధికకు 14 సంవత్సరాల వయస్సు ఉన్నందున రాధిక తల్లి ఈ వివాహాన్ని రద్దు చేయాలని కోరారు. ఆ వివాహాన్ని రతన్ కుమార్ బలవంతంగా చేసుకున్నాడని తెలిపారు.[25] రతన్ కుమార్ రాధికను సజీవ దహనం చేయాలనుకున్నాడని అరోపించాడు.[25] 2002 ఆగస్టు లో రతన్ గుండెపోటుతో మరణించాడు.[22] 2010 నవంబరులో రాధిక కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్. డి. కుమారస్వామి ని వివాహం చేసుకుంది.[26][2][6] రాధిక చెప్పినదాని ప్రకారం ఆ వివాహం 2006లో జరిగింది.[27][28] వారికి ఒక కుమార్తె "షమిక కె.స్వామి" ఉన్నది. [29][30]
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | కథానాయకుడు | భాష | వివరణ |
---|---|---|---|---|---|
2002 | నిన్నగాగి | మధు | విజయ రాఘవేంద్ర | కన్నడ | |
నీలమేఘశ్యామ | నీలమేఘ | సృజన లోకేష్ | |||
తవరిగే బా తంగి | లక్ష్మీ | శివ రాజకుమార్ | |||
ప్రేమ ఖైదీ | నందిని | విజయ రాఘవేంద్ర | |||
రోమియో జూలియట్ | |||||
2003 | ఊ లాలా | కృష్ణమోహన్ | |||
హడుగిగాగి | ఎస్. పి. చరణ్ | ||||
మణీ | మయూర్ పాటెల్ | ||||
మానే మగలు | విశాల్ హెగ్డే | ||||
తాయీ ఇల్లడ తబ్బాలీ | గౌరి | శివధ్వజ్ | కర్ణాటక రాష్ట్ర సినిమా పురస్కారం (ఉత్తమ నటి) | ||
యార్కాయి | నాన్సీ | అరుణ్ విజయ్ శ్యాం | తమిళం | ||
2004 | వర్నజాలం | అనిత | శ్రీకాంత్ | తమిళం | |
భద్రాద్రి రాముడు | సీత | తారకరత్న | తెలుగు | ||
మీసాయి మాధవన్ | రాణి | రమణ | తమిళం | ||
2005 | రిషి | స్ఫూర్తి | విజయ రాఘవేంద్ర | కన్నడ | |
మసాల | సుమ | సునీల్ రావు
విశల్ హెగ్డే |
|||
ఆటో శంకర్ | ఉపేంద్ర | ||||
అన్న తంగి | లక్ష్మీ | శివరాజ్ కుమార్ | |||
సొల్లత్తుమ | గౌరి | తమిళం | |||
2006 | మండ్య | గంగ | దర్శన్ | కన్నడ | |
హత్తెవార కనసు | మయూర్ పటేల్ | ||||
హటవది | అమిష | రవిచంద్రన్ | |||
ఉల్ల కదతాల్ | రమ్య | విఘ్నేష్ | తమిళం | ||
గుడ్ లక్ | మందాకిని | అనిరుధ్ | కన్నడ | ||
ఒడనుట్టి డవలు | వి.రవిచంద్రన్ | ||||
2007 | అనతరు | మంజు | దర్శాన్ | ||
జనపద | రాఘ | రాఘవ | |||
అమృతవాణి | సుమతి,
అమృతవాణి |
నవీన్ కృష్ణ
అజయ్ రావు |
|||
2008 | నవశక్తి వైభవ | కాటిలు దుర్గ | ఎవరూ కాదు | ||
2013 | స్వీటీ నాన్న జోడి | ప్రియ | ఆదిత్య సింగ్ | ||
2014 | అవతారం[31] | రాజేశ్వరి | సత్య ప్రకాష్ | తెలుగు | |
2015 | రుద్ర తాండవ | జాహ్నవి | చిరంజీవి సర్జ | కన్నడ | [32] |
2018 | కోంట్రాక్ట్ | అర్జున్ సర్జా | నిర్మాణంలో[33] | ||
బైరా దేవి | రమేష్ అరవింద్
స్కద్ అశోక్ |
నిర్మాణంలో | |||
రాజేంద్ర పోనప్ప | వి.రామచంద్రన్ | నిర్మాణంలో | |||
నిమగాగి | విజయ్ రాఘవేంద్ర | నిర్మాణంలో |
టెలివిజన్
సంవత్సరం | సినిమా | భాష | నటులు |
---|---|---|---|
2012 | లక్కీ | కన్నడ | యాష్, రమ్య |
2013 | స్వీటీ నాన్న జోడి | కన్నడ | ఆదిత్య , రాధిక |