రాధిక ఝా | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | 1970 ఢిల్లీ |
వృత్తి | రచయిత, ఒడిస్సీ నర్తకి |
జాతీయత | ఇండియన్ |
పూర్వవిద్యార్థి | అమ్హెర్స్ట్ కాలేజ్, చికాగో విశ్వవిద్యాలయం |
రాధికా ఝా (జననం 1970) భారతీయ నవలా రచయిత్రి, ఒడిస్సీ నృత్యకారిణి. ఆమె 2002లో తన మొదటి నవల స్మెల్(Smell)కి ఫ్రెంచ్ ప్రిక్స్ గెర్లైన్ అవార్డును గెలుచుకుంది.[1][2][3]
రాధిక ఝా 1970లో న్యూఢిల్లీలో జన్మించి ముంబైలో పెరిగింది. ఆమె టోక్యోలో 6 సంవత్సరాల పాటు నివసించింది. అక్కడ ఆమె జపనీస్ సంస్కృతిని అలవర్చుకుంది. ఆమె తర్వాత బీజింగ్‌కు వెళ్లింది. ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలతో ఏథెన్స్‌లో ఉంటొంది.[1]
రాధిక ఝా మసాచుసెట్స్‌లోని అమ్హెర్స్ట్ కాలేజీలో ఆంత్రోపాలజీలో డిగ్రీ పూర్తిచేసింది. తరువాత ఆమె చికాగో విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. పారిస్‌లో విద్యార్థిగా నివసించారు. ఆమె ఒడిస్సీ నృత్యంలో శిక్షణ పొందింది.
ఆమె జర్నలిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించి హిందుస్థాన్ టైమ్స్, బిజినెస్ వరల్డ్‌లో సంస్కృతి, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థలపై రచనలు చేసింది. ఆమె రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లో కొంతకాలం పనిచేసింది. అక్కడ ఆమె భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో తీవ్రవాద బాధితుల పిల్లల విద్య కోసం ఇంటరాక్ట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది
స్మెల్ 1999లో ప్రచురించబడిన ఆమె తొలి నవల. దీనికి ఫ్రెంచ్ ప్రిక్స్ గెర్లైన్ అవార్డు వరించింది.[4]