రాబిన్ స్టెండర్ స్వికార్డ్,అమెరికన్స్క్రీన్ ప్లేరచయిత్రి, సినిమా దర్శకురాలు, నాటక రచయిత, సాహిత్యకారిణి.[2]లిటిల్ ఉమెన్ (1994), మటిల్డా (1996), ప్రాక్టికల్ మ్యాజిక్ (1998), మెమోయిర్స్ ఆఫ్ ఎ గీషా (2005),[3]ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ (2008) వంటి సినిమాలకు స్క్రీన్‌ప్లే రాసింది.[4][5]ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ సినిమా ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగంలో అకాడమీ అవార్డుకు, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ ఆయింది. 2007లో వచ్చిన ది జేన్ ఆస్టెన్ బుక్ క్లబ్ సినిమాకు రచన, దర్శకత్వం వహించింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యురాలు.
స్వికార్డ్ 1952, అక్టోబరు 23న జీన్ కారోల్ స్వికార్డ్ (నీ స్టెండర్) - వ్యాపారవేత్త హెన్రీ "హాంక్" గ్రేడీ స్వికార్డ్ II దంపతులకు దక్షిణ కరోలినాలోని కొలంబియాలో జన్మించింది.[3] స్వికార్డ్ తండ్రి మిలిటరీలో పనిచేసినందున కుటుంబం తరచుగా వివిధ ప్రాంతాలకు తరలివెళ్ళేది. తన బాల్యంలో ఎక్కువభాగం స్పెయిన్‌లోని బార్సిలోనాలో గడిపిన స్వికార్డ్, చివరికి ఫ్లోరిడాలో స్థిరపడింది.[6] స్టీవెన్ స్వికార్డ్ అనే సోదరుడు ఉన్నాడు.
1987: ది డిస్నీ సండే మూవీ (టీవీ సిరీస్) – రచయిత, 1 ఎపిసోడ్: "యు రుయిన్డ్ మై లైఫ్"
1989: షాగ్ – లానియర్ లానీ & టెర్రీ స్వీనీతో స్క్రీన్ ప్లే
1993: ది రెడ్ కోట్ (చిన్న) - రచయిత, దర్శకుడు
1994: లిటిల్ ఉమెన్ ( లూయిసా మే ఆల్కాట్ రాసిన లిటిల్ ఉమెన్ పుస్తకం నుండి స్వీకరించబడింది) – స్క్రీన్ ప్లే, సహ నిర్మాత
1995: ది పెరెజ్ ఫ్యామిలీ (క్రిస్టిన్ బెల్ రాసిన ది పెరెజ్ ఫ్యామిలీ పుస్తకం నుండి స్వీకరించబడింది) - స్క్రీన్ ప్లే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్
1996: మటిల్డా ( రోల్డ్ డాల్ రాసిన మటిల్డా పుస్తకం నుండి నికోలస్ కజాన్‌తో స్వీకరించబడింది) – స్క్రీన్ ప్లే, సహ నిర్మాత
1998: ప్రాక్టికల్ మ్యాజిక్ ( ఆలిస్ హాఫ్‌మన్‌చే ప్రాక్టికల్ మ్యాజిక్ పుస్తకం నుండి అకివా గోల్డ్స్‌మన్, ఆడమ్ బ్రూక్స్‌తో స్వీకరించబడింది) – స్క్రీన్‌ప్లే, సహ నిర్మాత
2005: మెమోయిర్స్ ఆఫ్ ఎ గీషా ( ఆర్థర్ గోల్డెన్ రచించిన మెమోయిర్స్ ఆఫ్ ఎ గీషా పుస్తకం నుండి స్వీకరించబడింది) – స్క్రీన్ ప్లే
2007: ది జేన్ ఆస్టెన్ బుక్ క్లబ్ ( కరెన్ జాయ్ ఫౌలర్ రాసిన ది జేన్ ఆస్టెన్ బుక్ క్లబ్ పుస్తకం నుండి స్వీకరించబడింది) – స్క్రీన్ ప్లే, దర్శకుడు
2008: ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ (ఎఫ్. స్కాట్ ఫిట్జ్‌గెరాల్డ్ రచించిన చిన్న కథ నుండి ఎరిక్ రోత్‌తో కథ క్రెడిట్) – కథ
2016: ది ప్రామిస్ – స్క్రీన్‌ప్లే ( టెర్రీ జార్జ్‌తో కలిసి)[9]
2016: వేక్‌ఫీల్డ్ – స్క్రీన్‌ప్లే, దర్శకుడు. ఈఎల్ డాక్టరోవ్ చిన్న కథ ఆధారంగా[10]
2019: వెన్ దే సీ యు (టీవీ సిరీస్) - రచయిత, 2 ఎపిసోడ్‌లు
↑Swicord, Robin (November 14, 2014). "2014 Nicholl Screenwriting Awards: Robin Swicord". Academy of Motion Picture Arts and Sciences. Archived from the original on 2015-10-02. Retrieved 2023-06-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)