రామచంద్ర లాల్ (హిందీ: रामचन्द्र लाल ) (1821 – 1880) బ్రిటిష్ ఇండియాకు చెందిన గణీత శాస్త్రవేత్త. ఆయన రచించిన గ్రంథం Treatise on Problems of Maxima and Minima గణిత శాస్త్రజ్ఞుడు ఆగస్టస్ డి మోర్గాన్ ద్వారా ప్రచారం చేయబడింది.
డీ మోర్గాన్, రామచంద్రలాల్ గూర్చి పుస్తక పరిచయంలో ఆయన 1821 లో పానిపట్టులో సుందర్‌లాల్ కు జన్మించినారని తెలియజేశాడు. డీ మోర్గాన్ రామచంద్ర గూర్చి తెలుసుకొనుటకు 1850 లో వచ్చినపుడు 29 సంవత్సరాల స్వయం అభ్యసనం చేస్తున్న గణిత శాస్త్రవేత్త ద్వారా "గరిష్ట, కనిష్ట" అంశాలపై రచన చేయుటకు ఆయన స్నేహితుని పంపించాడు. రామచంద్ర ఆయన రచించిన పుస్తకాన్ని స్వీయ ఖర్చులతో కలకత్తాలో అదే సంవత్సరం ప్రచురించాదు. డీమోర్గాన్ అదే పుస్తకాన్ని లండన్ లో తన స్వంత పర్యవేక్షణలోపునః ముద్రించాడు.
డీ మోర్గాన్ యూరోపు లోని శాస్త్ర నిపుణుల ఆధ్వర్యంలో రామచంద్ర వ్రాసిన రచనలను అధీనంలోకి తీసుకొనుటకు ఆకర్షితుడయ్యాడు.
గణిత శాస్త్రవేత్త "చార్లెస్ మూసెస్" తన రచన Mathematical Intelligencer (1998) లోని ఒక వ్యాసంలో రామచంద్రను "డీ మోర్గాన్ యొక్క రామానుజన్"గా అభివర్ణించాడు. డీ మోర్గాన్ ఆయన గొప్పతనాన్ని గూర్చి అనేక ప్రచారాలు చేసినప్పటికీ ఆయన అజ్ఞాతంగా నే ఉన్నాడు. ఆయన గణిత శాస్త్ర అనేక పాఠ్య గ్రంథాలలో కనిపించడు.
రామచంద్ర ఢిల్లీ కలాశాలలో కొంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేసాడు. 1858 లో థామ్సన్ సివిల్ ఇంజనీరింగ్ కాలేజీకి ప్రధానోపాధ్యాయునిగా కూడా ఉన్నారు. ఈ కళాశాల ప్రస్తుతం "ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ"గా పిలువబడుతుంది. ఇది "రూర్కీ"లో ఉంది. అనంతరం ఆయన ఢిల్లీలోని పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు.