రామజోగయ్య శాస్త్రి | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
జననం | ఆరేపల్లి ముప్పాళ్ళ, నర్సరావుపేట | 1970 ఆగస్టు 24
వృత్తి | సినీ గేయ రచయిత |
క్రియాశీల కాలం | 2004 – present |
రామజోగయ్య శాస్త్రి సినీ గీత రచయిత. ఆయన స్వస్థలం నర్సరావుపేట దగ్గర ముప్పాళ్ళ. చిన్నతనంలో గాయకుడి కావాలని కలలు కనేవాడు. ఐదారు తరగతుల్లో సినిమాల ప్రభావం మొదలైంది. ఇంటర్‌కి ఊరు దగ్గర్లో ఉన్న నర్సరావుపేట వచ్చాడు. నచ్చిన పాటలన్నీ రికార్డ్ చేయించుకుని విని నేర్చుకునేవాడు. తరువాత ఇంజనీరింగ్ కోసం వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కళాశాలలో చేరాడు. తరువాత ఎం.టెక్.కోసం ఐఐటీ ఖరగ్‌పూర్ వెళ్ళాడు.
సినీపరిశ్రమ మద్రాసులో ఉండటంతో అక్కడ ఉద్యోగం దొరికితే గాయకుడవ్వాలనుకున్న తన కల సాకారం అవుతుందనుకున్నాడు కానీ బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. అప్పటి పరిస్థితికి ఆయనకు ఉద్యోగమే ముఖ్యమైంది కాబట్టి బెంగుళూరు వైపే మొగ్గు చూపాడు. అక్కడ ఓ గాయకుడితో పరిచయం అయ్య అక్కడక్కడా ఆర్కెస్ట్రాలలో పాడడం మొదలుపెట్టాడు. అక్కడే కన్నడ రచయిత శ్రీచంద్ర, గాయని సుజాత పరిచయమయ్యారు. వాళ్ళని పాడే అవకాశం ఇమ్మని కోరాడు. వాళ్ళు ఇతనికి శాస్త్రీయ సంగీత జ్ఞానం లేదు అని చెప్పడం ఇష్టం లేక పాటల రచయితగా ప్రయత్నించమన్నారు. అలా వాళ్ళ ప్రోత్సాహంతో ముందుగా దాదాపు నలభై క్యాసెట్లకు భక్తిపాటలు రాశాడు.
బెంగుళూరులో పనిచేస్తున్న కంపెనీ ఇబ్బందుల్లో పడటంతో మరో ఉద్యోగం చూసుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్ వచ్చాడు. కృష్ణ వంశీ ద్వారా సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కలుసుకుని ఆయన దగ్గర శిష్యరికం చేశాడు. రోజూ పన్నెండు గంటల నుండి రాత్రి ఎనిమిది దాకా ఆఫీసులో పని, తరువాత రాత్రి రాత్రి ఎనిమిదయ్యేసరికి శాస్త్రిగారింటికి. తెల్లారేవరకూ అక్కడే. అప్పుడొచ్చి కాసేపు నిద్రపోయి మళ్లీ ఆఫీస్‌కి వెళ్లేవాడు. అలా ఆయన దగ్గర గీత రచనలో మెలకువలు నేర్చుకున్నాడు.
కొన్నాళ్ళ తర్వాత స్రవంతి రవికిషోర్ నిర్మాతగా వచ్చిన యువసేన చిత్రానికి మొదటి సారిగా పాటల రచయితగా అవకాశం వచ్చింది. రెండూ హిట్ సాంగ్సే. కానీ, తరువాత ఏడాదిపాటు ఏ అవకాశమూ రాలేదు. మరి కొద్ది కాలం తర్వాత కళ్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన 'అసాధ్యుడు' చిత్రానికి రాసే అవకాశం వచ్చింది. చక్రి పరిచయమయ్యాడు. తరువాత శ్రీనువైట్ల 'ఢీ'లో అవకాశమిచ్చాడు. తరువాత రెడీ, చిరుత, లక్ష్యం... వరుస అవకాశాలొచ్చాయి. పాటల్లోపడి ఉద్యోగానికి న్యాయం చెయ్యలేకపోతున్నాడని అందుకు రాజీనామా చేశాడు.
సైమా అవార్డులు: ఉత్తమ గీత రచయిత