రామరత్నం శంకరన్

రా. శంకరన్
జననం
రామరత్నం శంకరన్

(1931-06-12)1931 జూన్ 12
మరణం2023 డిసెంబరు 14(2023-12-14) (వయసు 92)
వృత్తినటుడు, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1974–1999

రామరత్నం శంకరన్ (1931 జూన్ 12 - 2023 డిసెంబరు 14) భారతీయ సినిమా నటుడు, దర్శకుడు.

1962లో వచ్చిన ఆడి పేరుకు చిత్రంతో ఆయన తమిళ సినిమా నటుడిగా పరిచయమయ్యాడు. 1977లో వచ్చిన పెరుమైక్కురియవల్‌ చిత్రంలో ఆయన నటనకు మంచిపేరు వచ్చింది. ఆయన 50కిపైగా తమిళం, తెలుగు చిత్రాలలో సహాయ పాత్రలలో నటించి మెప్పించాడు. 1999లో చివరిసారిగా అళగర్ సామి చిత్రంలో నటించాడు.

మణిరత్నం దర్శకత్వం వహించిన మౌనరాగం (1986) చిత్రంలో రేవతికి తండ్రిగా నటించిన ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. అలాగే, సతీ లీలావతి (1995), అమరావతి (1996) వంటి తెలుగు అనువాద చిత్రాలలో కూడా ఆయన కనిపించాడు.

కెరీర్

[మార్చు]

ఆయన 1931 జూన్ 12న తమిళనాడులో జన్మించాడు.[1] నటుడు జావర్ సీతారామన్ బంధువు[2] అయిన ఆయన సినిమారంగంపై ఉన్న ఆసక్తితో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. సహాయదర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి దర్శకుడిగా మారాడు. 1974లో ఒన్నే ఒన్ను కన్నె కన్ను చిత్రం ద్వారా ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఎనిమిది విజయవంతమైన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం 1980లో విడుదలైన కుమారి పెన్నిన్‌ ఉల్లతిలే.

ఆ తర్వాత ఆయన నటుడిగా కొనసాగాడు.

మరణం

[మార్చు]

ఆర్.శంకరన్ 92 సంవత్సరాల వయస్సులో 2023 డిసెంబరు 14న వయోభారంతో చెన్నైలోని తన నివాసంలో మరణించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "R.Sankaran". Nadigar Sangam. Archived from the original on 8 August 2018. Retrieved 12 July 2016.
  2. Shivpprasadh, S. (14 June 2012). "Father figure". The Hindu. Archived from the original on 29 November 2014. Retrieved 31 August 2020.
  3. "Ra. Sankaran: మౌనరాగం నటుడు ఇకలేరు! | Tamil actor Ra. Sankaran is no more avm". web.archive.org. 2023-12-15. Archived from the original on 2023-12-15. Retrieved 2023-12-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)