రామవరప్పాడు | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°31′37.5470″N 80°40′44.6628″E / 16.527096389°N 80.679073000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఎన్టీఆర్ |
మండలం | విజయవాడ గ్రామీణ |
విస్తీర్ణం | 3.30 కి.మీ2 (1.27 చ. మై) |
జనాభా (2011)[2] | 22,222 |
• జనసాంద్రత | 6,700/కి.మీ2 (17,000/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 11,092 |
• స్త్రీలు | 11,130 |
• లింగ నిష్పత్తి | 1,003 |
• నివాసాలు | 6,130 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 521108 |
2011 జనగణన కోడ్ | 589215 |
రామవరప్పాడు, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన జనగణన పట్టణం. ఇది ప్రస్తుతం విజయవాడ నగరంలో కలిసిపోయింది.
రామవరప్పాడు ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లాలో ఉన్న ఒక జనాభా లెక్కల పట్టణం. 2011 భారత జనాభా లెక్కలు నివేదిక ప్రకారం రామవరప్పాడు పట్టణ జనాభా 22,222, అందులో 11,092 మంది పురుషులు కాగా 11,130 మంది స్త్రీలు.
0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2316, ఇది రామవరప్పాడు (సి.టి) మొత్తం జనాభాలో 10.42%. పట్టణ పరిధిలో స్త్రీల లింగ నిష్పత్తి రాష్ట్ర సగటు 993కి వ్యతిరేకంగా 1003గా ఉంది. అంతేకాకుండా రామవరప్పాడులో బాలల లింగ నిష్పత్తి 978 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటుతో పోలిస్తే 939. రామవరప్పాడు నగరం అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 67.02 కంటే 81.02% ఎక్కువ. . రామవరప్పాడులో పురుషుల అక్షరాస్యత దాదాపు 84.48% కాగా స్త్రీ అక్షరాస్యత 77.58%.
రామవరప్పాడు పట్టణ పరిధిలో మొత్తం 6,130 గృహాలకు స్థానిక స్వపరిపాలనా సంస్థ పరిపాలనను కలిగి ఉంది.[3]
ఇది సముద్ర మట్టంనుండి 21 మీ.ఎత్తులో ఉంది.
నాగార్జున నగర్ 1 కి.మీ, శ్రీ రామచంద్రనగర్ 1 కి.మీ, ప్రసాఅదంపాదు 1 కి.మీ గుణదల 1 కి.మీ, శ్రీనివాస నగర్ 1 కి.మీ
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
రామవరప్పాడు 16 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇక్కడికి దగ్గర్లో విజయవాడ విమానాశ్రయము గన్నవరంలో ఉంది.
ఈ గ్రామానికి సిటి బస్సుల సౌకర్యం ఉంది.
ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో పీకా లక్ష్మీకుమారి సర్పంచిగా ఎన్నికైంది. ఉపసర్పంచిగా కొల్లా ఆనందకుమార్ ఎం.బి.య్యే. ఎన్నికైనాడు.
ఈ ఆలయం స్థానిక వెంకమ్మ పేరంటాళ్ళు ఆలయంలో ఉపాలయంగా ఉంది. 2016, ఏప్రిల్-1వతెదీనుండి, ఈ ఆలయ పునర్నిర్మాణం చేపట్టెదరు.
అమ్మవారికి సంవత్సరం విడిచి సంవత్సరం వేమినేని వారిచే పసుపుకుంకుమలు ఇచ్చే సంప్రదాయం కలదు రామవరప్పాడులో రాజుల బజార్ లో గల పుట్టింటికి అమ్మవారు పుట్టింటి వారు అయిన రాజులు సంవత్సరం విడిచి సంవత్సరం పుట్టింటికి తీసుకు వెళతారు అమ్మవారికి ప్రతి సంవత్సరం భోగి సంక్రాంతి కనుమ జనవరి 13, 14, 15 తేదీలలో క్యాలెండర్ తో సంబంధం లేకుండా వైభవంగా జరుపుకుంటారు.
చాగంటిపాడు ట్రస్ట్:- ఈ ట్రస్ట్ ద్వారా గత కొంత కాలంగా పేద, బడుగు, బలహీనవర్గాలవారికి సేవలందించుచున్నారు. ఈ ట్రస్ట్ కార్యాలయాన్ని, ఈ గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో, 2015, అక్టోబరు-14వ తేదీనాడు ప్రారంభించారు.
{{cite web}}
: Missing or empty |title=
(help)