రామేశ్వర్ ఒరాన్ | |||
డాక్టర్ రామేశ్వర్ ఒరాన్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 29 డిసెంబర్ 2019 | |||
గవర్నరు | ద్రౌపది ముర్ము రమేష్ బైస్ సీ.పీ. రాధాకృష్ణన్ | ||
---|---|---|---|
ముందు | రఘుబర్ దాస్ | ||
జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 26 ఆగస్టు 2019 – 25 ఆగస్టు 2021 | |||
ముందు | అజోయ్ కుమార్ | ||
తరువాత | రాజేష్ ఠాకూర్ | ||
జార్ఖండ్ శాసనసభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 23 డిసెంబర్ 2019 | |||
ముందు | సుఖదేయో భగత్ | ||
నియోజకవర్గం | లోహర్దగా | ||
పదవీ కాలం 13 మే 2004 - 16 మే 2014 | |||
ముందు | దుఖా భగత్ | ||
తరువాత | సుదర్శన్ భగత్ | ||
నియోజకవర్గం | లోహర్దగా | ||
పదవీ కాలం 2004 – 2009 | |||
నియోజకవర్గం | లోహర్దగా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | దాల్తోన్‌గంజ్ , బీహార్ , (ఇప్పుడు జార్ఖండ్ ), బ్రిటిష్ ఇండియా | 1947 ఫిబ్రవరి 14||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | రాగిణి మింజ్ | ||
సంతానం | కుమారుడు (రోహిత్ ఒరాన్), కుమార్తె (నిషా ఒరాన్ సింగ్మార్) | ||
నివాసం | రాంచీ , జార్ఖండ్ , భారతదేశం | ||
మూలం | [1] |
రామేశ్వర్ ఒరాన్ భారతదేశానికి చెందిన మాజీ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి, రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా, ఒకసారి శాసనసభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.[1]
రామేశ్వర్ ఒరాన్ 1947 ఫిబ్రవరి 14న పాలములోని చియాంకిలో జన్మించాడు. ఆయన దాల్తోన్‌గంజ్‌లోని గణేష్ లాల్ అగర్వాల్ కాలేజీలో బిఎ (ఆనర్స్) డిగ్రీని, పాట్నా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.
రామేశ్వర్ ఒరాన్ 1971లో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (IES)లో చేరి ఆ తర్వాతి సంవత్సరం 1972లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)కి మారాడు. ఆయన రాజకీయాల పట్ల ఆసక్తితో 2004లో ఐపీఎస్‌ని వదులుకుని కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
రామేశ్వర్ ఒరాన్ 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లోహర్దగా నుండి లోక్‌సభకు ఎన్నికై మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పని చేసి, 2009 లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయాడు. ఆయన 2010 నుండి 2016 వరకు వరుసగా రెండు పర్యాయాలు 28 అక్టోబర్ 2010 నుండి 26 ఆగస్టు 2017 వరకు షెడ్యూల్డ్ తెగల జాతీయ కమీషన్ ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో లోహర్దగా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై[2] ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, ఆహార & పౌర సరఫరాల శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[3]
రామేశ్వర్ ఒరాన్ 26 ఆగస్టు 2019 నుండి 25 ఆగస్టు 2021 వరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశాడు.[4][5]