రామ్ నివాస్ మిర్ధా ( 1924 ఆగస్టు 24 - 2010 జనవరి 29) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బార్మర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా, 1953 నుండి 1967 వరకు రాజస్థాన్ శాసనసభ ఎన్నికై 1957 నుండి 1967 వరకు అసెంబ్లీ స్పీకర్‌గా, 1977 నుండి 1980 వరకు రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా కూడా వివిధ హోదాల్లో పనిచేశాడు.[1][2][3]
- రాజస్థాన్ శాసనసభ సభ్యుడు (1953–1967),
- వ్యవసాయం, నీటిపారుదల మరియు రవాణా మంత్రి, రాజస్థాన్ ప్రభుత్వం (1954–1957),
- స్పీకర్, రాజస్థాన్ శాసనసభ (1957–1967),
- సభ్యుడు, రాజ్యసభ, 4-5-1967 నుండి 2-4-1968 & 3-4-1968 నుండి 2-4-1974 (2వ పర్యాయం) & 3-4-1974 నుండి 2-4-1980 వరకు (మూడవ పదవీకాలం)
- కేంద్ర సహాయ మంత్రి – హోం వ్యవహారాలు, సిబ్బంది మరియు పరిపాలనా సంస్కరణల శాఖ (1970 జూన్–1974 అక్టోబరు),
- కేంద్ర సహాయ మంత్రి – రక్షణ ఉత్పత్తి (1974 అక్టోబరు – 1975 డిసెంబరు),
- కేంద్ర సహాయ మంత్రి – సరఫరా మరియు పునరావాసం (స్వతంత్ర బాధ్యత) (1975 డిసెంబరు – 1977 మార్చి),
- డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ (1977–1980),
- చైర్మన్, కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్, రాజ్యసభ, 1977–80,
- రాజ్యసభ సభ్యుడు 5-7-1980 నుండి 29-12-1984 (4వ పర్యాయం)
- జలవనరుల శాఖ మంత్రి (1983 జనవరి–1984 ఆగస్టు),
- విదేశీ వ్యవహారాల మంత్రి (1984 ఆగస్టు–1984 డిసెంబరు),
- మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జనవరి (1985-1986 అక్టోబరు),
- జౌళి శాఖ మంత్రి (క్యాబినెట్ ర్యాంక్), ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ అదనపు బాధ్యతలు (1986 అక్టోబరు–1989 డిసెంబరు),
- బార్మర్, రాజస్థాన్ నుండి పదవ లోక్ సభ సభ్యుడు (1991–1996),
- సెక్యూరిటీస్ & బ్యాంకింగ్ లావాదేవీలలో అక్రమాలపై విచారణ జరిపేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ 1992