రామ్ ప్రిత్ పాశ్వాన్ | |||
పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 16 నవంబర్ 2020 – 9 ఆగష్టు 2022 | |||
ముందు | వినోద్ నారాయణ్ ఝా | ||
---|---|---|---|
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2015 | |||
ముందు | రామావతార్ పాశ్వాన్ | ||
నియోజకవర్గం | రాజ్ నగర్ | ||
పదవీ కాలం 2005 – 2010 | |||
ముందు | రామ్ లఖన్ రామ్ రామన్ | ||
తరువాత | అరుణ్ శంకర్ ప్రసాద్ | ||
నియోజకవర్గం | ఖజౌళి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1963 మార్చి 21[1] | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
రామ్ ప్రిత్ పాశ్వాన్ (జననం 21 మార్చి 1963) బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు రాజ్‌నగర్ శాసనసభ నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖ మంత్రిగా పని చేశాడు.[2]
రామ్ ప్రిత్ పాశ్వాన్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2005లో జరిగిన ఎన్నికల్లో ఖాజాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత రాజ్ నగర్ అసెంబ్లీ నుండి పోటీ చేసి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
రామ్ ప్రిత్ పాశ్వాన్ 2020లో నాల్గొవసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత[4] నితీష్ కుమార్ మంత్రివర్గంలో 9 ఫిబ్రవరి 2021 నుండి 9 ఆగష్టు 2022 వరకు రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖ మంత్రిగా పని చేశాడు.