రామ్ సుతార్ | |
---|---|
జననం | గోండూర్, ధులే, మహారాష్ట్ర, భారతదేశం | 1925 ఫిబ్రవరి 19
అవార్డులు | 2016 పద్మభూషణ్ 1999 పద్మశ్రీ |
రామ్ వాంజీ సుతార్ (జననం 1925 ఫిబ్రవరి 19) ఒక భారతీయ శిల్పి. అతను స్టాట్యూ ఆఫ్ యూనిటీని కూడా రూపొందించాడు, ఇది 182 మీటర్ల (597 అడుగులు) ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం.[1]
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనంలో రామ్ సుతార్ రూపొందించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. 2023 ఏప్రిల్ 14న ఆంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాడు.[2][3]
సుతార్ 1925 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని ధులే జిల్లాలోని గోందూర్ గ్రామంలో విశ్వకర్మ కుటుంబంలో జన్మించాడు. 1952లో ప్రమీలను వివాహం చేసుకున్నాడు.[4]
గుజరాత్లో ఉన్న ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సుతార్ రూపొందించారు. 45 అడుగుల ఎత్తైన చంబల్ స్మారక చిహ్నాన్ని, మహాత్మా గాంధీ ప్రతిమను కూడా ఆయన నిర్మించారు.[5]