రామ్నా కాళీ మందిర్ | |
---|---|
![]() రామ్నా కాళీ మందిర్ | |
పేరు | |
ఇతర పేర్లు: | రామ్నా కలిబారి |
స్థానం | |
దేశం: | బంగ్లాదేశ్ |
జిల్లా: | ఢాకా జిల్లా |
ప్రదేశం: | ఢాకా |
రామ్నా కాళీ మందిర్ (బెంగాలీ: রমনা কালী মন্দির) మొఘల్ సామ్రాజ్య కాలంలో నిర్మించబడిన బంగ్లాదేశ్ లో గల ఢాకాలోని ఒక హిందూ దేవాలయం. దీనిని "రామ్నా కలిబారి" అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ ప్రధాన దైవం కాళీమాత. ఈ ఆలయం బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్తాన్ సైన్యంచే ధ్వంసం చేయబడింది.ఇది ఢాకా రేస్‌కోర్సు పక్కన ఉంది. డాకా రేసుకోర్సును ఇపుడు సుహ్రావర్ది ఉద్యానవనం అని పిలుస్తారు. మొత్తం ఆలయం దాదాపు 2.25 ఎకరాల (9,100 మీ2) విస్తీర్ణంలో విస్తరించి, బంగ్లా అకాడమీకి ఎదురుగా, రామనా పార్క్‌కు దక్షిణం వైపున ఉంది.
1971 మార్చి 27న బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ సైన్యం ఈ ఆలయాన్ని ధ్వంసం చేసింది. ఇది ఎక్కువగా హిందువులను ఊచకోత కోసిన ప్రదేశం.[1]
నేపాల్ జానపద కథల ప్రకారం, రామనా కాళి ఆలయాన్ని కాళీ మాత భక్తులు స్థాపించారు. వీరు హిమాలయాల నుంచి బంగ్లాకు వచ్చి ఇక్కడ ఆలయం నిర్మించారు. ఈ ఆలయం శతాబ్దాల తరబడి ఉన్నప్పటికీ, ఇది 20వ శతాబ్దం ప్రారంభంలో అభివృద్ధి చేయబడింది. ఈ ఆలయం రాజేంద్ర నారాయణ్ (1882-1913) భార్య రాణి బిలాష్మోని దేవీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడింది. ఆ సమయంలో, ఈ ఆలయం ఢాకాలోని ఎత్తైన ప్రదేశాలలో ఒకటి.
ఆలయ నిర్మాణ రూపకల్పన శతాబ్దాల తరబడి జరిగింది. ఆలయం ముందు ఒక పెద్ద కొలను ఉంది, ఇది భక్తులకు, సందర్శకులకు పుణ్యస్నానం ఆచరించడానికి ప్రసిద్ధ ప్రదేశం. ఈ ఆలయం ఎత్తైన శిఖరంచే నిర్మించబడింది. ఆలయం పక్కనే ఆనందమయీ మాత ఆశ్రమం (బెంగాలీ: মা আনন্দময়ী আশ্রম) ఉంది. 1971 మార్చి 7 నాటి షేక్ ముజిబుర్ రెహమాన్ తీసిన చిత్రాలలో ఆలయ రూపకల్పన డాక్యుమెంట్ చేయబడింది. ఈ ఆలయాన్ని పాత్రికేయులు లేదా చరిత్రకారులు ఫోటో తీయడం ఇదే చివరిసారి.
1971 మార్చి 25 రాత్రి, అప్పటి తూర్పు పాకిస్తాన్లో బంగ్లా జాతీయవాద ఉద్యమాన్ని వ్యతిరేకించడానికి పాకిస్తాన్ సైన్యం తన "ఆపరేషన్ సెర్చ్‌లైట్"ని ప్రారంభించింది. ఇది మారణహోమానికి, బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి దారితీసింది. ఆపరేషన్ సెర్చ్‌లైట్ హిందూ యువకులను, మేధావులను, విద్యార్థులను, విద్యావేత్తలను లక్ష్యంగా చేసుకుంది. ఆపరేషన్ సెర్చ్‌లైట్ జగన్నాథ్ హాల్ (ఢాకా యూనివర్శిటీ క్యాంపస్‌లోని హిందూ విద్యార్థుల కోసం ఉన్న ఒక హాస్టల్), రామనా కాళీ మందిర్‌లతో సహా ప్రముఖ హిందూ ప్రదేశాలపై దృష్టి సారించింది.[2]
1971 మార్చి 27న, పాకిస్తాన్ సైన్యం రామనా కాళీ మందిర్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించి, ఒక గంటలోపే, 100 మందిని పైగా హతమార్చారు. ఆలయ సముదాయంలో ఆశ్రయం పొందిన అనేక మంది ముస్లింలు కూడా చంపబడ్డారు.[3]
2000 వరకు, ఆలయం కూల్చివేతకు సంబంధించిన కథనాలు వార్తల్లో వచ్చాయి. అదే సంవత్సరం పాలక రాజకీయ పార్టీ అయిన అవామీ లీగ్ బహిరంగ విచారణను ప్రారంభించింది.2000 సెప్టెంబరులో, ఛైర్మన్ జస్టిస్ కెఎం శోభన్, ఆలయ ధ్వంసానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను సమర్పించారు. ఈ ఊచకోతలో దాదాపు 50 మంది బాధితులు మాత్రమే గుర్తించబడ్డారు. ఇతర బాధితులు, బంధువులు మరణించారు.[4][5]
రామనా కాళీ మందిర్ ప్రాంతంలో దుర్గా దేవి, రాధా కృష్ణ మందిరాలు ఉన్నాయి. మరికొన్ని హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి. భారత ప్రభుత్వం పునర్నిర్మాణ ప్రయత్నాల కోసం దీనికి ప్రత్యేక నిధులను కేటాయించింది.[6][7]