రామ్ కుమార్ (1924 – 2018) భారతీయ చిత్రకారుడు, రచయిత. అతడు ప్రసిద్ధ అమూర్త భావనా చిత్రకారులలో ఒకడు.[6] అతడు ఒక ఆధునిక వాది. ఎం.ఎఫ్. హుస్సేన్, ఎఫ్.ఎన్. సౌజా, హెచ్.గాడే, ఎస్.హెచ్. రాజా తదితరులతో కూడిన ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్ బృందంతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. ఈ బృందంతో కలిసి అతడు భారత కళల పట్ల నూతన ఒరవడిని సృష్టించాడు. అతడు ప్రకృతి దృశ్యాలను అద్భుతంగా చిత్రిస్తాడు.[7] అమూర్త చిత్రకళ కొరకు ఫిగరేటివ్ చిత్రాలను గీసిన మొదటి భారతీయులలో ఒకనిగా గుర్తింపబడ్డాడు.[8] గృహాలలో, అంతర్జాతీయ మార్కెట్ అతని చిత్రాలు ఎక్కువ ధరలకు అమ్ముడవుతాయి. అతడు గీసిన "ద వేగబాండ్" న్యూయార్క్ లో $1.1 మిలియన్ల ధర పలికింది. ఇది ఒక ప్రపంచ రికార్డు. రచనలోను, చిత్రకళలోనూ రాణించిన కొద్ది భారతీయ ఆధునికవాదులలో అతను ఒకడు[9]
రామ్ కుమార్ వర్మ హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన సిమ్లాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మిచాడు.[10] అతడి తండ్రి పంజాబ్ లోని పాటియాలాలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసాడు. ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో సివిల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పనిచేసాడు.[11][12] రామ్ కుమార్ న్యూఢిల్లీ లోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి ఎం.ఎ (ఆర్థిక శాస్త్రం) లో పట్టాను పొందాడు.[13] 1945లో అయడు ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు అవకాశం పొందాడు.[14] ఒకనాటి సాయంత్రం, సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలోని తన స్నేహితులతో పాటు కన్నాట్ ప్లేస్‌లో తిరుగుతూ అనుకోకుండా అక్కడి కళా ప్రదర్శనలో అడుగుపెట్టాడు.[15]
రామ్ కుమార్ "శైలోజ్ ముఖర్జీ" నడుపుతున్న శారదా ఉకిల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో తరగతులను నిర్వహించేవాడు.[16] శైలాజ్ ముఖర్జీ శాంతినికేతన్ స్కూలులో చిత్రకారుడు. అతడు రామ్‌కుమార్ కు సజీవ మోడల్స్‌లోచిత్ర కళను పరిచయం చేసాడు.[17] అక్కడ విద్యార్థిగా ఉన్నప్పుడు అతడు "రాజా" ను ఒక ప్రదర్శనలో కలిసాడు. రాజా, రామ్ లు మంచి స్నేహితులైనారు.[18] పెద్ద చదువులను పారిస్ లో "ఆండ్రి లోటే", "ఫెర్నాండ్ లెగెర్" ల వద్ద చదువుకొనుటకు రామ్ కుమార్ తన తండ్రిని ఒప్పించాడు.[19] పారిస్ లో పసిఫిక్ శాంతి ఉద్యమం ఆయనను ఆకర్షించింది. అతడు ఫ్రెంచ్ కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. అక్కడ సామాజిక వాస్తవ వాదులైన "కాతే", ఫోర్గెనన్ ల ప్రభావానికి లోనయ్యాడు.[20] అతడిని ప్రసిద్ధ చిత్రకారులైన ఎస్.హెచ్.రాజా, ఎం.ఎఫ్.హుస్సేన్ లతో స్నేహం కుదిరింది.[21]
అతడు అమూర్త చిత్రాలను సాధారణంతో తైలం లేదా ఎక్రిలిక్ లతో వేసాడు.[22] అతడు "ప్రోగ్రెసివ్ ఆర్టిస్టు గ్రూపు" తో మంచి సంబంధాలను కలిగి ఉండేవాడు.[23]
రామ్ కుమార్ భారతదేశంలోనే కాక అనేక దేశాలలో చిత్రప్రదర్శనలలో పాల్గొన్నాడు. అందులో 1958 లో జరిగిన వెనిస్ బిన్నేల్ ఒకటి.[24] 1987, 1988 లలో యు.ఎస్.ఎస్.ఆర్, జపాన్ లలో జరిగిన భారతీయ ఉత్సవాలలో పాల్గొన్నాడు.[25] అతడు 2008 లో ఢిల్లీలో సోలో ఎగ్జిబిషన్ ను ఇటీవల నిర్వహించాడు.[26] అతడు హిందీ లో రచనలు చేసాడు. అతడు రాసిన రచనలు ఎనిమిది సంపుటాలుగా ప్రచురితమయ్యాయి. అందులో రెండు నవలలు, ఒక యాత్రా చరిత్ర వర్ణన ఉన్నాయి.[27]
ఆయన గీసిన తొలి చిత్రాలలో నగర జీవన పరిస్థితి ప్రధాన అంశంగా ఉండేది.[19][28] చిత్రాలలో ప్రత్యేకంగా వారణాసిలో, దాని శిథిలమైన, పాడైపోయిన ఇళ్ళు, నిరాశాజనక భావాలను తెలియచేస్తుంది.[29]
ప్రకృతి ప్రదేశాల ఉల్లాసం, మానవ సమాజంలో జరిగిన హింసను చూపించే చిత్రాలను గీసాడు.[19]
భారతీయ కళలో ఆసక్తి పెరిగినందున, రామ్ కుమార్ చిత్రలేఖనాల కళకు మార్కెట్లో గుర్తింపు పెరిగింది.[30]