రామ్‌నగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
![]() రామ్‌నగర్ రోడ్డు | |
Coordinates: 17°43′18″N 83°18′42″E / 17.721742°N 83.311652°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
ప్రభుత్వం | |
• సంస్థ | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
కాల మండలం | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530002 |
Vehicle registration | ఏపి-31 |
రామ్‌నగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరానికి మధ్యలో ఉన్న ప్రాంతం.[1] ఇది విశాఖ మహా నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో ఉంది.[2]
ఇది 17°43′18″N 83°18′42″E / 17.721742°N 83.311652°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
ఇక్కడికి సమీపంలో ద్వారకా నగర్, అసీల్‌మెట్ట, డాబా గార్డెన్స్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]
నగరంలోని ముఖ్యమైన వాణిజ్య ప్రాంతాలలో ఒకటైన రామ్‌నగర్ ప్రాంతంలో గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ అడ్మినిస్ట్రేటివ్ భవనాలు ఉన్నాయి.[4] ఇక్కడికి సమీపంలోని వాల్తేరు రోడ్డులలో ప్రధాన రహదారిలో దుస్తులు, వంటగది వస్తువులు, బూట్లు, బొమ్మలు, బహుమతులు మొదలైన వస్తువుల దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్ళు, బేకరీలు కూడా ఉన్నాయి.
ఈ ప్రాంతంలో సెవెన్ హిల్స్ హాస్పిటల్స్, అపోలో హార్ట్ సెంటర్, లాజరస్ హాస్పిటల్స్, ఓమ్ని ఆర్కె ఆస్పత్రి వంటి కార్పొరేట్ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రామ్‌నగర్ మీదుగా వెంకోజిపాలెం, అప్పుఘర్, వుడా పార్క్, ఏయు అవుట్‌గేట్, సిరిపురం, గవర్నర్ బంగ్లా, గ్రీన్ పార్క్, జగదాంబ సెంటర్, టర్నర్ చౌల్ట్రీ, పూర్ణా మార్కెట్, కుర్పాం మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో గోపాలపట్నం రైల్వే స్టేషను, దువ్వాడ రైల్వే స్టేషను ఉన్నాయి.[5]