రాయదుర్గం మెట్రో స్టేషను | ||
---|---|---|
హైదరాబాదు మెట్రో స్టేషను | ||
![]() | ||
General information | ||
Location | రహేజా మైండ్‌స్పేస్ జంక్షన్, లెమన్ ట్రీ హోటల్ ఎదురుగా, రాయదుర్గం, హైదరాబాదు, తెలంగాణ - 500081[1] | |
Tracks | 2 | |
Construction | ||
Structure type | పైకి | |
Depth | 7.07 meters | |
Platform levels | 2 | |
History | ||
Opened | 29 నవంబరు 2019 | |
Services | ||
Lua error in మాడ్యూల్:Adjacent_stations at line 237: Unknown line "Blue". |
రాయదుర్గం మెట్రో స్టేషను, హైదరాబాదులోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. ఇది హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.[2][3] హైదరాబాద్ మెట్రో మొదటి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైన రెండు సంవత్సరాల తరువాత 2019, నవంబరు 29 న ఈ స్టేషన్ ప్రారంభించబడింది. రహేజా మైండ్‌స్పేస్ జంక్షన్ సమీపంలో ఉన్న ఈ మెట్రో స్టేషను[4] హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో ఒకటి.[5]
ఈ మెట్రో స్టేషను స్టేషన్ నీలిరంగు లైనుకు టెర్మినల్ పాయింట్.[6] ఇక్కడ 2వ దశ విమానాశ్రయ మార్గం ప్రారంభమవుతుంది.[7] 2012లో ఈ స్టేషను ప్రతిపాదించబడగా,[8] ప్రారంభంలో శిల్పారామం వద్ద మెట్రో రైలు ముగించాలని భావించారు. కానీ అక్కడ చెరువు ఉండడంతో[9] కిలోమీటరు దూరంలో ఉన్న రాయదుర్గం వరకు విస్తరించి, 15 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు.[10] ఈ స్టేషను లెమన్ ట్రీ హోటల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ లకు ఎదురుగా, హైదరాబాద్ బయోడైవర్శిటీ పార్క్ నుండి 1.6 కి.మీ.ల దూరంలో ఉంది.[11] ఎల్ అండ్ టి మెట్రో రైల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అతిపెద్ద మాల్ (సుమారు పది మిలియన్ చదరపు అడుగులు) ను ఈ మెట్రో స్టేషను సమీపంలో నిర్మించబోతున్నారు.[12][13] ఈ స్టేషనుకు సమీపంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డిపి) లో భాగంగా మైండ్‌స్పేస్ అండర్‌పాస్ నిర్మించబడింది.[14]
2019, నవంబరు 29న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.
రాయదుర్గం ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.
స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[1]
జి | స్థాయి | నిష్క్రమణ/ప్రవేశం |
ఎల్ 1 | మెజ్జనైన్ | ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్ |
ఎల్ 2 | సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి ![]() | |
దక్షిణ దిశ | → నాగోల్ వైపు → | |
ఉత్తర దిశ | → ← టెర్మినల్ ← ← | |
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి ![]() | ||
ఎల్ 2 |