రాశి | |
జన్మ నామం | విజయలక్ష్మి |
జననం | |
ఇతర పేర్లు | రాశి, మంత్ర, విజయలక్ష్మి |
క్రియాశీలక సంవత్సరాలు | 1985 - ఇప్పటివరకు |
భార్య/భర్త | శ్రీ ముని[1] |
ప్రముఖ పాత్రలు | గోకులంలో సీత, శుభాకాంక్షలు (సినిమా) |
రాశి ఒక తెలుగు నటి. బాలనటిగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి నాయికగా గోకులంలో సీత, శుభాకాంక్షలు (సినిమా) సినిమాలతో మంచి పేరు సంపాదించింది. తమిళంలో మంత్ర అనే పేరుతో నటించింది.శీను, సముద్రం, వెంకీ వంటి చిత్రాలలో కొన్ని ప్రత్యేక గీతాలలో నటించింది.
రాశి చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిది భీమవరం, తండ్రిది చెన్నై. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఈమె తాత పద్మాలయ, విజయ వాహిని స్టూడియోలకు జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసేవాడు. తండ్రి మొదట్లో బాలనటుడిగా కనిపించినా తర్వాత డ్యాన్సర్ గా మారాడు. రాశి కూడా చిన్నతనంలో బాలనటిగా నటించింది. పదో తరగతి దాకా చదివింది. సినిమాలలో కథానాయిక అయిన తర్వాత ఆంగ్ల సాహిత్యంలో బి. ఎ చేసింది.[2]