రాష్ట్రీయ సిఖ్ సంగత్

రాష్ట్రీయ సిఖ్ సంగత్

రాష్ట్రీయ సిఖ్ సంఘత్ అనేది భారతదేశానికి చెందిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కు సిక్కు అనుబంధ సంస్థ. రాష్ట్రీయ సిఖ్ సంఘత్ ఒక హిందూ జాతీయవాద సంస్థ.[1]

స్థాపన, విస్తరణ

[మార్చు]

ఇది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చేత ప్రేరణ పొంది ప్రారంభించబడింది. ప్రధానంగా రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో చురుకుగా పనిచేస్తుంది.

Nishan Sahib.svg
సిక్కుల అంతర్జాతీయ కమ్మూనిటీ జెండా

లక్ష్యం

[మార్చు]

దేశ సమగ్ర నిర్మాణంలో హిందువులను, సిక్కులను ఏకం చేయడమే దీని ముఖ్య లక్ష్యం.[1]

అధ్యక్షుడు

[మార్చు]

2014 లో, రాష్ట్రీయ సిఖ్ సంఘత్ అధ్యక్షుడిగా గుర్చరన్ సింగ్ గిల్‌ ఎంపిక అయ్యాడు.

భావజాలం

[మార్చు]

ఇది సిక్కుల గురువులను, వారి విశ్వాసాన్ని ప్రత్యేకంగా గౌరవిస్తుంది అని సంఘత్ జాతీయ అధ్యక్షుడు జిఎస్ గిల్ చెప్పారు. న్యూ ఢల్లీలో గురు గోవింద్ సింగ్ (పదవ సిక్కు సాధువు) 350 వ జయంతిని పురస్కరించుకుని సంఘత్ కార్యక్రమాన్ని నిర్వహించింది.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Sanjeev Kelkar (2011). Lost Years of the RSS. SAGE Publications. pp. 181–182. ISBN 978-81-321-0762-0.
  2. "RSS respects Sikhism, not trying to merge it with Hinduism: Rashtriya Sikh Sangat chief". Hindustan Times, New Delhi | By Smriti Kak Ramachandran, OCT 25, 2017 10:59 AM IST.