రాహుల్ చాహర్

రాహుల్ చాహర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రాహుల్ దేస్రాజ్ చాహర్
పుట్టిన తేదీ (1999-08-04) 1999 ఆగస్టు 4 (వయసు 25)
ఆగ్రా, ఉత్తర ప్రదేశ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రబౌలర్
బంధువులుదీపక్ చాహర్ (కజీన్)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 237)2021 జూలై 23 - శ్రీలంక తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.28
తొలి T20I (క్యాప్ 81)2019 ఆగస్టు 6 - వెస్టిండీస్ తో
చివరి T20I2021 నవంబరు 8 - నమీబియా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.28
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016/17–ప్రస్తుతంరాజస్థాన్
2017రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ (స్క్వాడ్ నం. 1)
2018–2021ముంబై ఇండియన్స్ (స్క్వాడ్ నం. 28)
2022--ప్రస్తుతంపంజాబ్ కింగ్స్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్ డే ట్వంటీ20 ఫస్ట్-క్లాస్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 1 6 20 47
చేసిన పరుగులు 13 5 380 262
బ్యాటింగు సగటు 13.00 5.00 20.00 10.91
100లు/50లు 0/0 0/0 0/1 0/0
అత్యుత్తమ స్కోరు 13 5 84 48
వేసిన బంతులు 60 132 3,539 2,423
వికెట్లు 3 7 73 80
బౌలింగు సగటు 18 23.85 29.50 25.48
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 7 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/54 3/15 5/59 5/24
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 3/– 5/– 14/–
మూలం: ESPNcricinfo, 30 డిసెంబరు 2022

రాహుల్ దేస్రాజ్ చాహర్, ఉత్తర ప్రదేశ్ కు చెందిన క్రికెటర్. దేశీయ క్రికెట్‌లో రాజస్థాన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. 2019 ఆగస్టులో భారతదేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[1]

జననం

[మార్చు]

రాహుల్ 1999, ఆగస్టు 4న హిందూ జాట్ కుటుంబంలో దేశరాజ్ సింగ్ చాహర్ - ఉషా చాహర్ దంపతులకు ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో జన్మించాడు. అతని కజిన్ సోదరుడు, దీపక్ కూడా భారత అంతర్జాతీయ క్రికెటర్ గా రాణించాడు.[2][3][4] అతని కజిన్ మాల్తీ చాహర్ బాలీవుడ్ నటి.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రాహుల్ తన చిరకాల స్నేహితురాలు ఇషానితో 2019లో నిశ్చితార్థం చేసుకున్నాడు.[5] 2022 మార్చిలో వివాహం చేసుకున్నాడు.[6][7]

క్రికెట్ రంగం

[మార్చు]

తండ్రి తరపు మేనమామ లోకేంద్ర సింగ్ చాహర్ అతని క్రికెట్ కోచ్, అతని బంధువు దీపక్ చాహర్‌కు కలిసి శిక్షణ ఇచ్చారు. రాహుల్ తన అన్నయ్య సోదరుడు దీపక్ చాహర్‌ను చూసి 8 సంవత్సరాల వయస్సులో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఫాస్ట్ బౌలర్‌గా ప్రారంభించిన రాహుల్, తన అసలు ప్రతిభ బంతిని స్పిన్నింగ్ చేయడంలో ఉందని గ్రహించాడు.

దేశీయ క్రికెట్

[మార్చు]

2016, నవంబరు 5న 2016–17 రంజీ ట్రోఫీలో రాజస్థాన్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[8] 2017, ఫిబ్రవరి 25న 2016–17 విజయ్ హజారే ట్రోఫీలో రాజస్థాన్ తరపున తన లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[9]

2017 ఫిబ్రవరిలో 2017 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ జట్టు రాహుల్‌ను 10 లక్షలకు కొనుగోలు చేసింది.[10] 2017 ఏప్రిల్ 8న 2017 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన ట్వంటీ20 క్రికెట్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[11] 2018 జనవరిలో 2018 ఐపిఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ అతనిని కొనుగోలు చేసింది.[12]

2018–19 విజయ్ హజారే ట్రోఫీలో రాజస్థాన్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు, తొమ్మిది మ్యాచ్‌ల్లో ఇరవైమందిని అవుట్‌ చేశాడు.[13] 2018 అక్టోబరులో 2018–19 దేవధర్ ట్రోఫీ కోసం ఇండియా సి జట్టులో ఎంపికయ్యాడు.[14]

2019 ఆగస్టులో 2019–20 దులీప్ ట్రోఫీ కోసం ఇండియా గ్రీన్ టీమ్ స్క్వాడ్‌లో రాహుల్ ఎంపికయ్యాడు.[15][16] 2022 ఫిబ్రవరిలో 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం వేలంలో పంజాబ్ కింగ్స్ అతనిని కొనుగోలు చేసింది.[17]

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

2019 జూలైలో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ కోసం భారత ట్వంటీ 20 ఇంటర్నేషనల్ క్రికెట్ జట్టుకు రాహుల్ ఎంపికయ్యాడు.[18] 2019, ఆగస్టు 6న వెస్టిండీస్‌పై తన టీ20లోకి అరంగేట్రం చేసాడు.[19] 2021 జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్ కోసం భారత టెస్ట్ జట్టులో ఐదుగురు స్టాండ్‌బై ప్లేయర్‌లలో ఒకరిగా ఎంపికయ్యాడు.[20] మరుసటి నెలలో మొదటి టెస్టుకు ముందు భారత జట్టులో చేర్చబడ్డాడు.[21]

2021 జూన్ లో శ్రీలంకతో జరిగే వారి సిరీస్ కోసం భారతదేశ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో రాహుల్ ఎంపికయ్యాడు.[22] 2021 జూలై 23న శ్రీలంకపై భారతదేశం తరపున తన వన్డే అరంగేట్రం చేసాడు.[23] 2021 సెప్టెంబరులో, చాహర్ 2021 ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టుకు ఎంపికయ్యాడు.[24]

మూలాలు

[మార్చు]
  1. "Rahul Chahar". ESPN Cricinfo. Retrieved 2023-08-08.
  2. "Ranji Trophy: After Deepak Chahar, 'doosra' in household as Rahul Chahar takes nine wickets". The Indian Express. 5 November 2018. Retrieved 2023-08-08.
  3. "Big brother, little brother - The Chahars' India dream". Cricbuzz (in ఇంగ్లీష్). 16 December 2016. Retrieved 2023-08-08.
  4. Acharya, Shayan. "IPL 2019: A brotherly gathering". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2023-08-08.
  5. "Rahul Chahar gets engaged to long-time girlfriend". cricketcountry. 13 December 2019.
  6. "Rahul Chahar ties the knot with Ishani Johar in a grand wedding ceremony in Goa". SportsKeeda. Retrieved 2023-08-08.
  7. "Rahul Chahar ties knot with fiance Ishani in destination wedding in Goa; pictures surface". SportsTiger. Retrieved 2023-08-08.
  8. "Ranji Trophy, Group B: Rajasthan v Odisha at Patiala, Nov 5-8, 2016". ESPN Cricinfo. Retrieved 2023-08-08.
  9. "Vijay Hazare Trophy, Group C: Madhya Pradesh v Rajasthan at Chennai, Feb 25, 2017". ESPN Cricinfo. Retrieved 2023-08-08.
  10. "List of players sold and unsold at IPL auction 2017". ESPN Cricinfo. Retrieved 2023-08-08.
  11. "Indian Premier League, 4th match: Kings XI Punjab v Rising Pune Supergiant at Indore, Apr 8, 2017". ESPN Cricinfo. Retrieved 2023-08-08.
  12. "List of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 2023-08-08.
  13. "Vijay Hazare Trophy, 2016/17 - Rajasthan: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 2023-08-08.
  14. "Rahane, Ashwin and Karthik to play Deodhar Trophy". ESPN Cricinfo. Retrieved 2023-08-08.
  15. "Shubman Gill, Priyank Panchal and Faiz Fazal to lead Duleep Trophy sides". ESPN Cricinfo. Retrieved 2023-08-08.
  16. "Duleep Trophy 2019: Shubman Gill, Faiz Fazal and Priyank Panchal to lead as Indian domestic cricket season opens". Cricket Country. Retrieved 2023-08-08.
  17. "IPL 2022 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 2023-08-08.
  18. "MS Dhoni out of West Indies tour, Hardik Pandya rested". ESPN Cricinfo. Retrieved 2023-08-08.
  19. "3rd T20I, India tour of United States of America and West Indies at Providence, Aug 6 2019". ESPN Cricinfo. Retrieved 2023-08-08.
  20. "India's squad for first two Tests against England announced". Board of Control for Cricket in India. Retrieved 2023-08-08.
  21. "Knee injury rules Axar Patel out of first England Test". Crickbuzz. Retrieved 2023-08-08.
  22. "Shikhar Dhawan to captain India on limited-overs tour of Sri Lanka". ESPN Cricinfo. Retrieved 2023-08-08.
  23. "3rd ODI (D/N), Colombo (RPS), Jul 23 2021, India tour of Sri Lanka". ESPN Cricinfo. Retrieved 2023-08-08.
  24. "India's T20 World Cup squad: R Ashwin picked, MS Dhoni mentor". ESPN Cricinfo. Retrieved 2023-08-08.

బయటి లింకులు

[మార్చు]