రాహుల్ నార్వేకర్ | |||
పదవీ కాలం 3 జులై 2022 – ప్రస్తుతం | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
---|---|---|---|
ముందు | నరహరి సీతారాం జిర్వాల్ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 21 నవంబర్ 2019 – ప్రసృతం | |||
ముందు | రాజ్ కే. పురోహిత్ బీజేపీ | ||
నియోజకవర్గం | కొలాబా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1977 కొలాబా, మహారాష్ట్ర, భారతదేశం[1] | ||
తల్లిదండ్రులు | సురేష్ మురారి నార్వేకర్ |
రాహుల్ నార్వేకర్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో కొలాబా అసెంబ్లీ నియోజకవర్గం నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి 2022 జులై 3న మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యాడు.[2]
రాహుల్ నార్వేకర్ తండ్రి సురేష్ నార్వేకర్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2009లో శివసేన పార్టీలో చేరి సేన యూత్ వింగ్ అధికార ప్రతినిధిగా పని చేశాడు. ఆయన 2014 లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ ఆశించి టిక్కెట్ దక్కకపోవడంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లో చేరి[3] ఎన్సీపీ నుండి మావల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.
రాహుల్ నార్వేకర్ 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి కొలాబా అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ తరుఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ జగ్తాప్‌పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2022లో మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ స్థానానికి పోటీ చేయగా మొత్తం 288 సభ్యుల్లో 145 మంది మద్దతు అవసరం ఉండగా రాహుల్ నార్వేకర్‌కు 164 ఓట్లు వచ్చాయి. మహావికాస్ అఘాఢీ (ఎంవీఏ) కూటమికి చెందిన శివసేన అభ్యర్థి రాజన్ సాల్వికు 106 ఓట్లు రావడంతో రాహుల్ నార్వేకర్ 2022 జులై 3న 19వ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యాడు.[4]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)