రాహుల్ వేదప్రకాష్ పాటిల్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 | |||
ముందు | సంజయ్ జాదవ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ముఖేడ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | శివసేన (యుబిటి) | ||
ఇతర రాజకీయ పార్టీలు | శివసేన | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాహుల్ వేదప్రకాష్ పాటిల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పర్భని శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాహుల్ పాటిల్ శివసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పర్భని శాసనసభ నియోజకవర్గం నుండి ఎస్‌హెచ్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తన సమీప ప్రత్యర్థి ఎంఐఎం అభ్యర్థి సయ్యద్ ఖలీద్ సయ్యద్ సాహెబ్ జాన్‌పై 26,526 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వంచిత్ బహుజన్ ఆఘడి అభ్యర్థి మహ్మద్ గౌస్ జైన్‌పై 81,790 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]
రాహుల్ పాటిల్ శివసేన పార్టీలో జరిగిన పరిణామాల అనంతరం ఆయన శివసేన (యుబిటి) వర్గంలో చేరి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శివసేన (యుబిటి) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి ఆనంద్ శేషారావు భరోస్ పై 37,784 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5][6]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)