రికీ కేజ్ (ఆంగ్లం: Ricky Kej; జననం 1981 ఆగస్టు 5) మూడు సార్లు గ్రామీ అవార్డు కైవసం చేసుకుని, మరో మూడు సార్లు నామినేట్ అయిన భారతీయ సంగీత స్వరకర్త, పర్యావరణవేత్త.[1] ఆయన న్యూయార్క్, జెనీవాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంతో సహా 30కి పైగా దేశాల్లోని వేదికలపై ప్రదర్శన ఇచ్చాడు.[2] డిసెంబరు 2022లో, ఆయనను ఐక్యరాజ్యసమితి హైకమిషనర్ (UNHCR) "గుడ్‌విల్ అంబాసిడర్"గా ప్రకటించాడు.[1]
2022లో, ఆయన బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ విభాగంలో రాక్ & రోల్ లెజెండ్ స్టీవర్ట్ కోప్‌ల్యాండ్‌తో కలిసి తన ఆల్బమ్ "డివైన్ టైడ్స్" రూపొందించాడు. దీనికి గానూ 64వ వార్షిక గ్రామీ అవార్డ్స్‌లో గ్రామీని గెలుచుకున్నాడు. ఈ ఆల్బమ్ రోలింగ్ స్టోన్, బ్లూమ్‌బెర్గ్, ది సండే గార్డియన్, ఇండియా టుడే వంటి అనేక వార్తా సంస్థలచే విమర్శకుల ప్రశంసలు పొందింది.
ఫిబ్రవరి 2023లో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్ విభాగంలో 65వ వార్షిక గ్రామీ అవార్డ్స్‌లో "డివైన్ టైడ్స్" రెండవ గ్రామీ అవార్డును గెలుచుకుంది.[3] 2015లో, ఆయన 57వ వార్షిక గ్రామీ అవార్డ్స్‌లో తన ఆల్బమ్ "విండ్స్ ఆఫ్ సంసార" కోసం బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ విభాగంలో గ్రామీని గెలుచుకున్నాడు.[4] ది ప్రాజెక్ట్, అతని 14వ స్టూడియో ఆల్బమ్, ఆగస్ట్ 2014లో యుఎస్ బిల్బోర్డ్ న్యూ ఏజ్ ఆల్బమ్‌ల చార్ట్‌లో నంబర్ 1 స్థానంలో నిలిచింది,[5][6] ఇది భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి మొదటిది కావడం విశేషం.[7] ఈ ఆల్బమ్ జూలై 2014 నెలలో జోన్ మ్యూజిక్ రిపోర్టర్ టాప్ 100 రేడియో ఎయిర్‌ప్లే చార్ట్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది.[8]
భారతదేశంలో బలమైన పైరసీ వ్యతిరేక చట్టాల కోసం ఆయన న్యాయవాదిగా కృషి చేస్తున్నాడు.[9][10]
రికీ కేజ్ 1981 ఆగస్టు 5న పంజాబీ, మార్వాడీ దంపతులకు జన్మించాడు.[11] ఆయన ఎనిమిదేళ్ల వయసులో వారి కుటుంబం బెంగుళూరుకు మారి అక్కడే నివసిస్తున్నారు.[12] ఆయన బిషప్ కాటన్ బాయ్స్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసాడు. ఆ తరువాత ఆక్స్ఫర్డ్ డెంటల్ కాలేజ్ నుండి డెంటిస్ట్రీని పూర్తి చేశాడు. కానీ ఆయన ఆ రంగంలో వృత్తిని కొనసాగించకుండా సంగీత వృత్తిని ఎంచుకున్నాడు.[13] యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు అతను ప్రోగ్రెసివ్ రాక్ బ్యాండ్‌లో చేరాడు, అది అతనికి సంగీతానికి మంచి పునాదిని వేసిందని చెప్పాలి.[14] ఆయన తల్లి పమ్మీ కేజ్ అడ్డుచెప్పలేదు. ఆయన తాత నటుడు, ఒలింపిక్ సైక్లిస్ట్, స్వాతంత్ర్య సమరయోధుడు అయిన అతని జానకి దాస్.[15][16]