![]() | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రిచర్డ్ కీత్ ఇల్లింగ్‌వర్త్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బ్రాడ్‌ఫోర్డ్, యార్క్‌షైర్, ఇంగ్లాండ్ | 1963 ఆగస్టు 23|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Slow left–arm orthodox | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | అంపైరు, బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 551) | 1991 జూలై 4 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1995 డిసెంబరు 26 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 113) | 1991 మే 23 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1996 మార్చి 9 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1982–2000 | వోర్సెస్టర్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1988/89 | Natal | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2001 | డెర్బీషైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంపైరుగా | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన టెస్టులు | 64 (2012–2023) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన వన్‌డేలు | 78 (2010–2023) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన టి20Is | 27 (2010–2022) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన మటెస్టులు | 1 (2005) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన మవన్‌డేలు | 6 (2003–2008) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన మటి20Is | 13 (2011–2016) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 9 July 2023 |
రిచర్డ్ కీత్ ఇల్లింగ్‌వర్త్ (జననం 1963 ఆగస్టు 23) ఇంగ్లాండ్ మాజీ క్రికెటరు. అంపైర్‌గా పనిచేస్తున్నాడు. [1] అతని దేశీయ క్రికెట్ కెరీర్‌లో ఎక్కువ భాగం వోర్సెస్టర్‌షైర్‌తో జరిగింది. డెర్బీషైర్‌తో, విదేశాలలో నాటల్‌తో కూడా ఆడాడు. అతను 1992, 1996 క్రికెట్ ప్రపంచ కప్‌లలో పాల్గొనడంతో సహా ఇంగ్లండ్ తరపున తొమ్మిది టెస్టులు, ఇరవై ఐదు వన్‌డేలు ఆడాడు. అతను రే ఇల్లింగ్‌వర్త్ కుమారుడని అనేక వెబ్‌సైట్‌లు, పొరపాటుగా తాసాయి. కానీ ఈ ఇద్దరికీ ఏ చుట్టరికమూ లేదు.
ప్రధానంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా ఆడిన ఇల్లింగ్‌వర్త్, 1982లో ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేసి, కేవలం రెండు సెకండ్ XI మ్యాచ్‌లు ఆడిన తర్వాత వోర్సెస్టర్‌షైర్ ఫస్టు టీమ్‌కి ప్రమోట్ అయ్యాడు. సోమర్‌సెట్‌పై 3–61 సాధించాడు. ఆ సంవత్సరం అతని గణాంకాలు చాలా మామూలుగా ఉన్నాయి: పద్దెనిమిది ఫస్ట్-క్లాస్ వికెట్లు, 45 సగటుతో, వన్డే క్రికెట్‌లో కేవలం ఎనిమిది ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు; కానీ వోర్సెస్టర్‌షైర్ అతనిలో సామర్థ్యం ఉందని గమనించి, కొనసాగించింది. 1983 నాటికి, అతను మొదటి-జట్టులో రెగ్యులరుగా ఉంటూ, నలభై ఎనిమిది ఫస్ట్-క్లాస్ వికెట్లు తీశాడు. ఆ తర్వాతి సంవత్సరం అతను (57తో) మెరుగుపడ్డాడు. అతను నాటల్ కోసం దక్షిణాఫ్రికా క్యూరీ కప్‌లో ఒక సీజన్ (1988/89) ఆడాడు. అది తప్పించి, మిగతా ఆటంతా ఇంగ్లీషు దేశీయ క్రికెట్‌లో మాత్రమే ఆడాడు.
అతని ఇరవై-సీజన్ కౌంటీ క్రికెట్ కెరీర్‌లో చాలా వరకు, ఇల్లింగ్‌వర్త్ వోర్సెస్టర్‌షైర్‌లోనే ఉన్నాడు. 1988, 1989లో కౌంటీ కౌంటీ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నప్పుడు అతని కౌంటీ కెరీర్‌లో ముఖ్యాంశాలు వచ్చాయి. అతను, 2000లో కాంట్రాక్ట్ పొడిగింపును గెలుచుకోవడంలో విఫలమైన తర్వాత, ఫస్ట్-క్లాస్ గేమ్‌లో అతని చివరి రెండు సంవత్సరాలు డెర్బీషైర్‌తో గడిపాడు. అతను 31.54 సగటుతో 831 వికెట్లు, 22.45 సగటుతో 7,000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు, ఇందులో నాలుగు ఫస్ట్-క్లాస్ సెంచరీలు ఉన్నాయి.
1990, ఇల్లింగ్‌వర్త్‌కు మంచి ప్రోత్సాహకరమైన సంవత్సరం. 28.29 బౌలింగ్ సగటుతో 75 వికెట్లు తీశాడు. అతను ఆ శీతాకాలపు A జట్టు పర్యటనలో పాకిస్తాన్. శ్రీలంక వెళ్ళాడు. తరువాతి సీజన్‌లో, మే సండే లీగ్ గేమ్‌లో నార్తెంట్స్‌పై సరైన సమయంలో 5–49తో విజృంభించడం, కొన్ని రోజుల తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన 1991 టెక్సాకో ట్రోఫీ వన్ డే ఇంటర్నేషనల్ సిరీస్‌కి ఎంపికయ్యేందుకు అతనికి సహాయపడింది. అతను మ్యాచ్‌లో కీలక పాత్ర పోషిస్తూక్, తన పది ఓవర్లలో కేవలం 20 పరుగులే ఇచ్చి, జెఫ్ డూజన్ వికెట్ తీసాడు. ఆపై మైక్ అథర్టన్‌తో కలిసి 23 పరుగుల నాటౌట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లాండ్ థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది.
ఇల్లింగ్‌వర్త్ 1992, 1996లో రెండు క్రికెట్ ప్రపంచ కప్‌లలో ఇంగ్లండ్ తరపున ఆడాడు. 1992 ప్రపంచ కప్ సమయంలో, ఇల్లింగ్‌వర్త్ ఫైనల్‌లో ఆడి, తన 10 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చి, జావేద్ మియాందాద్ వికెట్ తీసుకున్నాడు. లాంగ్-ఆన్‌లో ఇమ్రాన్ ఖాన్‌ను క్యాచ్ చేశాడు.
1991లో జరిగిన ఇతర రెండు టెక్సాకో ట్రోఫీ మ్యాచ్‌లలో అతని ప్రదర్శనలు అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ, అతను లార్డ్స్‌లో రిచీ రిచర్డ్‌సన్, యువ బ్రియాన్ లారా వికెట్లను తీసుకున్నాడు. ఫిల్ డిఫ్రీటాస్ బౌలింగులో కెప్టెన్ వివ్ రిచర్డ్స్ ఇచ్చిన క్యాచ్ పట్టాడు. ఇల్లింగ్‌వర్త్ ఆ సంవత్సరం మొదటి రెండు టెస్టు మ్యాచ్‌లకు ఎంపిక కాలేకపోయాడు, కానీ ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన మూడో టెస్ట్‌కు ఎంపికయ్యాడు. టెస్టు క్రికెట్‌లో తన మొదటి బంతికే ఫిల్ సిమన్స్ వికెట్ తీశాడు/ 1959/60లో ఇంతిఖాబ్ ఆలం తర్వాత అది సాధించిన మొదటి బౌలరు. మొత్తమ్మీద పదకొండవవాడు. [2] అతను 3–110కి చేరుకునే క్రమంలో రిచర్డ్స్‌ను కూడా బౌల్డ్ చేశాడు, అయితే బ్యాట్‌తో రెండు సార్లు పట్టుదలతో నిలబడ్డాడు (మొదటి ఇన్నింగ్స్‌లో రాబిన్ స్మిత్‌తో కలిసి 42, రెండో ఇన్నింగ్స్‌లో డిఫ్రీటాస్‌తో కలిసి 38 పరుగులు జోడించడం).
ఇల్లింగ్‌వర్త్ ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన నాల్గవ టెస్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు; జట్టు లోని మొత్తం పదకొండు మంది ఆటగాళ్లూ ఫస్ట్-క్లాస్ సెంచరీ చేసినవారే అయి ఉండటం ఆ మ్యాచ్ విశిష్టత. కానీ, ఇంగ్లండ్ సులభంగా ఓడిపోయింది. ఇల్లింగ్‌వర్త్ ఓవర్‌కి దాదాపు ఐదు పరుగుల చొప్పున ఇచ్చి, కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. అతన్ని ఓవల్ టెస్టు జట్టులోంచి తీసేసారు. అతని స్థానంలో ఫిల్ టఫ్నెల్ వచ్చాడు. ఆ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో టుఫ్నెల్ 6–25తో ఇంగ్లండ్‌ను సిరీస్‌ను స్మానం చేసిన విజయానికి నడిపించాడు. ఇల్లింగ్‌వర్త్ 1995 వరకు మరో టెస్టు ఆడలేదు. కొన్ని సంవత్సరాల పాటు తన వన్డే స్థానాన్ని మాత్రం నిలబెట్టుకున్నాడు. 1992 ప్రపంచ కప్‌లో మంచి ప్రదర్శన చేశాడు.
1995 నాటికి, ఇల్లింగ్‌వర్త్ రెండు సంవత్సరాల పాటు ఇంగ్లండ్ జట్టుకు దూరంగా ఉన్నాడు. కానీ సెలెక్టర్లు కౌంటీ జట్టులో అతని ప్రదర్శనలకు ముగ్ధులయ్యారు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు అతన్ని పిలిచారు. అతను నాల్గవ టెస్టు, ఆరవ టెస్టు మినహా అన్నింటిలోనూ ఆడాడు. ఐదవ టెస్ట్‌లో వేలికి గాయమైనప్పటికీ మైక్ వాట్కిన్‌సన్‌తో కలిసి చివరి వికెట్ భాగస్వామ్యంలో ఆడి మ్యాచ్‌ను డ్రా చేసినందుకు ప్రశంసలు అందుకున్నాడు. క్రిస్టోఫర్ మార్టిన్-జెంకిన్స్ "డాక్టరు ఆదేశాలను ఇల్లింగ్‌వర్త్ ధైర్యంగా ధిక్కరించడాన్ని" ప్రశంసించాడు. [3] అతని సిరీస్ బౌలింగ్ గణాంకాలు 6–215 ప్రత్యేకించి అత్యద్భుతంగా లేనప్పటికీ, అతను దక్షిణాఫ్రికాకు శీతాకాల పర్యటనకు ఎంపికయ్యాడు. ఇది మంచి నిర్ణయమేనని తేలింది: ఇంగ్లండ్ తరపున ఇల్లింగ్‌వర్త్‌కు అది అత్యుత్తమ సిరీస్. 21లోపు సగటుతో తొమ్మిది టెస్టు వికెట్లు తీశాడు. అతను 1996 ప్రపంచ కప్‌లో కూడా నాలుగు సార్లు కనిపించాడు, కానీ ఆ తర్వాత సెలెక్టర్ల ప్రాధాన్యత నిర్ణయాత్మకంగా టఫ్నెల్ వైపు మళ్లింది. ఇల్లింగ్‌వర్త్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు.
ఇల్లింగ్‌వర్త్ 2006 ఇంగ్లీష్ క్రికెట్ సీజన్‌లో ఫస్ట్-క్లాస్ అంపైర్ల పూర్తి జాబితాలో ECB కి నియమించబడ్డాడు. [4] 2008 ఇంగ్లీష్ క్రికెట్ సీజన్ ముగిసే సమయానికి ఇల్లింగ్‌వర్త్ 47 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లకు అంపైర్‌గా చేసాడు. [5] అతను రిచర్డ్ కెటిల్‌బరో 2009 నవంబరు 9న ఐసిసి అంతర్జాతీయ జాబితాలోకి పదోన్నతి పొందాడు. రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ 2013 జూన్ 25న ఐసిసి ఎలైట్ అంపైర్ ప్యానెల్‌లో చేరాడు.
అతను 2015 క్రికెట్ ప్రపంచ కప్ సమయంలో మ్యాచ్‌లలో నిలిచిన ఇరవై మంది అంపైర్లలో ఒకడు. [6] 2019 ఏప్రిల్లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్‌లో మ్యాచ్‌లలో కూడా నిలిచాడు.[7] [8] 2019 జూలైలో, భారతదేశం, న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ కోసం ఇద్దరు ఆన్-ఫీల్డ్ అంపైర్లలో ఒకరిగా ఎంపికయ్యాడు. [9] 2019 సంవత్సరానికి ఐసిసి అంపైర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికై, డేవిడ్ షెపర్డ్ ట్రోఫీని గెలుచుకున్నాడు.
2021 జనవరిలో, ఇల్లింగ్‌వర్త్ బంగ్లాదేశ్, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లకు అంపైరుగా నిలుచున్నాడు. కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత టెస్టు సిరీస్‌కు న్యూట్రల్ అంపైరును నియమించడం అదే తొలిసారి. [10] 2021 జూన్‌లో, ఇల్లింగ్‌వర్త్ 2021 ఐసిసి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఆన్-ఫీల్డ్ అంపైర్లలో ఒకరిగా ఎంపికయ్యాడు. [11] ఓవల్‌లో జరిగిన 2023 WTC ఫైనల్‌కు కూడా అధికారిగా వ్యవహరించాడు.