రివల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
---|---|
స్థాపన తేదీ | 2016 |
Preceded by | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) |
ప్రధాన కార్యాలయం | షహీద్ సర్వన్ సింగ్ చీమా ట్రస్ట్, 352/1, ఫగ్వారీ మొహల్లా, గర్హా, జలంధర్, పంజాబ్ - 144022. |
పార్టీ పత్రిక | సంగ్రామి లెహర్ |
విద్యార్థి విభాగం | పంజాబ్ స్టూడెంట్ ఫెడరేషన్ కన్వీనర్ గగన్‌దీప్ మాన్సా |
యువత విభాగం | షహీద్ భగత్ సింగ్ యూత్ ఫెడరేషన్ ఇప్పుడు జనరల్ సెక్రటరీ ధర్మిందర్ సింగ్ ముకేరియన్ రివల్యూషనరీ యూత్ (కేరళ) |
మహిళా విభాగం | ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ ఫెడరేషన్ |
కార్మిక విభాగం | రివల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ యూనియన్ |
రైతు విభాగం | జంహూరి కిసాన్ సభ |
రాజకీయ విధానం | కమ్యూనిజం మార్క్సిజం-లెనినిజం |
రాజకీయ వర్ణపటం | వామపక్ష రాజకీయాలు |
ECI Status | నమోదు చేయబడింది - గుర్తించబడలేదు |
లోక్‌సభ స్థానాలు | 0 |
రాజ్యసభ స్థానాలు | 0 |
శాసన సభలో స్థానాలు | Indian states 1 / 140 (కేరళ శాసనసభ)
|
రివల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్ఎంపిఐ) అనేది భారతదేశానికి చెందిన వామపక్ష కమ్యూనిస్ట్ రాజకీయ పార్టీ.[1]
పార్టీ మార్క్సిస్ట్ భావజాలంపై ఆధారపడింది, కొంత మార్క్సిస్ట్-లెనినిజంతో మిళితం చేయబడింది. ఇదే లక్ష్యాలతోకూడిన ఇతర పార్టీలతో కేరళ ఆధారిత రివల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీని విలీనం చేయడం ద్వారా ఈ పార్టీ ఏర్పడింది. చాలా పార్టీలు కమ్యూనిస్ట్ లేదా మార్క్సిస్ట్ వంటి చాలా పార్టీలు విలీనం అయినాయి. సిపిఎం పంజాబ్, సిపిఎం హర్యానా, చండీగఢ్ మార్క్సిస్ట్ పార్టీ, హిమాచల్ మార్క్సిస్ట్ పార్టీ, ఛత్తీస్‌గఢ్ మార్క్సిస్ట్ పార్టీ, తమిళనాడు మార్క్సిస్ట్ పార్టీ, ఆంధ్రా మార్క్సిస్ట్ పార్టీ, పశ్చిమ బెంగాల్ మార్క్సిస్ట్ పార్టీ, ఢిల్లీ మార్క్సిస్ట్ పార్టీలు 2016లో విలీనమైనాయి. మంగత్ రామ్ పస్లా, కెకె రెమా మొదలైనవారు ఆర్ఎంపిఐ నాయకులుగా ఉన్నారు.[2][3][4][5] 2017 నవంబరు 23 నుండి 26 తేది వరకు చండీగఢ్‌లో రివల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్ఎంపిఐ) మొదటి అఖిల భారత సమావేశం జరిగింది. ఈ పార్టీ ప్రధాన కార్యాలయం జలంధర్‌లో ఉంది.